ఖమ్మం వార్తలు

బెండ చేనులు మేసిన 300 మేకలు…చనిపోయిన 65 మేకలు ..

బెండ చేనులు మేసిన 300 మేకలు…చనిపోయిన 65 మేకలు ..
పురుగు మందు కొట్టడంతోనే ఈ దుర్ఘటన
హుటాహుటిన ఖమ్మం పశువైద్యశాలకు తరలింపు ..
చికిత్స అందించిన వైద్యులు

ఖమ్మం రూరల్ మండలం ఆరెకోడు తండాలో మేతకు వెల్లిన 300మేకలు ఒక్కసారిగా కుప్పకూలిపొయాయి. వాటిలో 65 మేకలు ఇప్పటికే మరణించాయి…ఈ పరిణామంతో గ్రామస్తులు హతాశులయ్యారు…మేకల యజమానులు లబోదిబోమంటున్నారు …

బెండ చేను లోనే సుమారు 50 మేకలు చనిపోగా.. ఖమ్మంలోని జిల్లా పశువైద్యశాలలో 15 మేకలు చనిపోయాయి. మరో 50 మేకలకు చికిత్స అందిస్తున్నారు.
బెండకాయ చేనులో రసాయనిక మందులు పిచికారి చేయడం వల్ల అవి తిన్న మేకలు చనిపోయి ఉంటాయని రైతులు అనుమానిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 65 మేకలు చనిపోయాయని ఇంకా పొలంలో సైతం చెట్లల్లో చనిపోయిన మేకలు కనిపిస్తున్నాయని హాస్పిటల్లో సైతం చాలావరకు మేకలు అస్వస్థత గురయ్యాయని స్థానికులు చెబుతున్నారు.

Related posts

వినోబా కాలనీ వాసులకు గృహవసతి కల్పించండి …మాది న్యాయమైన పోరాటం

Ram Narayana

మధిర భట్టి ప్రచారంలో కీలకం “మేడం నందిని” ..

Ram Narayana

చెడు వ్యసనాలకు అలవాటు పడితే భవిష్యత్ కోల్పోతాం.. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

Ram Narayana