Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పచ్చదనంతోనే ఆరోగ్యం౼ మంత్రి పువ్వాడ…

పచ్చదనంతోనే ఆరోగ్యం౼ మంత్రి పువ్వాడ.
-పారిశుధ్యంపై దృష్టిపెట్టాలి
-పళ్లలో ప్రగతి …పట్టణాలపై ఫోకస్
-పట్టణాల్లో విరివిగా మొక్కలు నాటాలి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న పల్లె పట్టణ ప్రగతితో ఇప్పటికే గ్రామాల స్వరూపం మారిపోయిందని, పట్టణాలు ఇప్పుడే గాడిన పడుతున్నాయని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.

ముఖ్యంగా అందులో హరితహారం కార్యక్రమం ద్వారా పచ్చదనంతో పాటు స్వచ్ఛమైన గాలి పీల్చడం ద్వారానే కలుగుతుందన్నారు.

పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఖమ్మం కార్పొరేషన్ 18, 19వ డివిజన్ నందు చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని రైతు బంధు సమితి రాష్ట్ర కన్వీనర్ పల్లా రాజేశ్వర రెడ్డి తో కలిసి కాల్వలు శుభ్రం చేసేందుకు అధునాతన హైడ్రాలిక్ ట్రాక్టర్ ను ప్రారంభించారు.

అనంతరం రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. ర్రోడ్లు, సైడ్ కాల్వలు, విద్యుత్ స్తంభాలు పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న పనులు, చేపట్టాల్సిన పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతితో డివిజన్లలో చేసుకోవాల్సిన ప్రతి పనులను చేసుకోవాలన్నారు. ముఖ్యంగా పారిశుధ్ధ్యంపై ఎక్కువ దృష్టి సారించాలని అన్నారు. మనం చేపట్టాల్సిన అభివృద్ది కార్యక్రమాలలో ముందంజలో నిలవాలనే ఉద్ధేశ్యంతో ప్రభుత్వం ప్రారంభించిన పల్లెప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులందరు పాల్గొని కష్టపడి పనిచేస్తే నగరాభివృద్ది సాధ్యమన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పల్లెలు, పట్టణాల అభివృద్ధి కోసం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి తో పాటు పచ్చదనం కోసం హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారని, పది రోజుల పాటు జరుగే కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కష్టపడి పనిచేస్తే నగరాలు శుభ్రంగా తయారవుతాయని అదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని అన్నారు.

మిషన్ భగీరథతో ఇంటింటికి నల్లాల ద్వారా మంచి నీటి సరఫరా జరగాలన్నారు. వర్షాకాలం వచ్చినందున అన్ని డివిజన్లలో క్లోరినేషన్ జరపాలని, ఏవిధమైన వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు చేపట్టాలన్నారు.

దళితులలో పేదరిక నిర్మూలనకు వారి అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి దళిత్ ఎంపవర్ మెంట్ స్కీం కు రూపకల్పన చేశారని ప్రజా ప్రతినిధులు అధికారులతో దాదాపు పది గంటలు సమావేశం నిర్వహించారని, ప్రతి నియోజకవర్గంలో 100 మంది చొప్పున 10 లక్షల రూపాయాలను రైతు బంధు తరహాలో వారి అకౌంటులో జమచేసేలా కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారని, ఈ ఫథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ త్వరలో జారీ అవుతాయన్నారు. నిరుద్యోగులు, పేద దళితులు పేదరికం నుండి బయటపడేలా సహాయం అందుతుందన్నారు.

.

Related posts

Ulta Beauty is Having the Ultimate Hair Care Sale

Drukpadam

నడి వయసులో పదో తరగతి పరీక్షలు రాసిన ఎమ్మెల్యే!

Drukpadam

కార్పొరేట్ ప్రపంచం ఎదుర్కొంటున్న కొత్త సమస్యను వివరించిన సత్య నాదెళ్ల..

Drukpadam

Leave a Comment