జనరల్ వార్తలు ...

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో హీరో నాగార్జున భేటీ

  • ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసిన హీరో నాగార్జున
  • భట్టి నివాసంలో మర్యాదపూర్వకంగా సాగిన సమావేశం
  • చిన్న కుమారుడు అఖిల్ వివాహానికి ఆహ్వానం
  • స్వయంగా వెళ్లి శుభలేఖ అందజేసిన నాగార్జున

ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున బుధవారం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిశారు. హైదరాబాద్‌లోని ఉప ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఈ సమావేశం జరిగింది. తన చిన్న కుమారుడు, యువ హీరో అక్కినేని అఖిల్ వివాహ మహోత్సవానికి హాజరు కావాల్సిందిగా భట్టి విక్రమార్కను నాగార్జున స్వయంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాగార్జున… అఖిల్ వివాహ ఆహ్వాన పత్రికను ఉప ముఖ్యమంత్రికి అందజేశారు. అనంతరం వారిద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. అక్కినేని అఖిల్ నిశ్చితార్థం గత ఏడాది నవంబర్‌లో జరిగింది. అక్కినేని నాగార్జున తన కుమారుడి వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తదితరులను ఆహ్వానించారు.

Related posts

యాంటీ రేబిస్ వ్యాక్సిన్ కోసం 20 కి.మీ. నడిచిన 92 ఏళ్ల బామ్మ

Ram Narayana

ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ లో లోపాలు… వెంటనే అప్ డేట్ చేసుకోవాలన్న కేంద్రం

Ram Narayana

రివ్యూలు చేసేటప్పుడు జాగ్రత్త .. కన్నప్ప టీమ్ వార్నింగ్

Ram Narayana