ఖమ్మం వార్తలు

దారా బాలరాజు సేవలు మరువలేనివి… అమ్మ ఫౌండేషన్ మల్లు నందిని

మధిర మండలం ఆత్కూరు గ్రామంలో మధిర మండలం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు దారా బాలరాజు గారి సంతాప సభలో పాల్గొన్న డీప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క గారి సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్క ముందుగా దారా బాలరాజు గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం నందిని విక్రమార్క గారు మాట్లాడుతూ దారా బాలరాజు మృతి వ్యక్తిగతంగా తీరని లోటని పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పని చేశారని నిబద్ధత కలిగిన నాయకున్ని కోల్పోయామని తెలిపారు దారా బాలరాజు చేసిన సేవలు మరువలేనివి అని ఎదైనా సమస్య పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసేవాడిని అలాంటి నాయకుడు మన మధ్యన లేకపోవడం అత్యంత బాధాకరమైన విషయం అని తెలిపారు అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ధైర్యంగా ఉండాలని అండగా ఉంటామని హామీ ఇచ్చారు
ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అనుబంధ సంఘాల నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

Related posts

సిపిఐ 100 సంవత్సరాల పండుగ… వేదిక కానున్న ప్రభుత్వ కళాశాల గ్రౌండ్

Ram Narayana

నదులు, కాల్వలు, రోడ్లపై అక్రమ కట్టడాలు ఉండొద్దు

Ram Narayana

అట్టహసంగా డిప్యూటీ సీఎం భట్టి కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుక

Ram Narayana