సినిమా వార్తలు

 ప్రియదర్శి, నిహారిక కాంబోలో కొత్త మూవీ .. ‘మిత్ర మండలి’ ఫ‌స్ట్ లుక్ రిలీజ్

టాలీవుడ్ న‌టుడు ప్రియదర్శి మరో కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గీతా ఆర్ట్స్ 2 బాధ్యతల నుంచి విరామం తీసుకున్న నిర్మాత బన్నీ వాస్, తన సొంత బ్యానర్ బన్నీ వాస్ వ‌ర్క్స్‌ని ప్రారంభించి, దానిలో మొదటి సినిమాగా ఒక కొత్త ఎంటర్‌టైనర్‌ను నిర్మించబోతున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. మిత్ర‌మండ‌లి అంటూ ఈ సినిమాను తెర‌కెక్కించ‌బోతుండ‌గా.. బన్నీ వాసు ఈ సినిమాను సమర్పిస్తున్నారు. సప్త అశ్వ మీడియా వర్క్స్ మరియు వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రియ‌ద‌ర్శి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రంలో సోష‌ల్ మీడియా ఇన్‌ప్లుయెన్స‌ర్ నిహారిక NM క‌థానాయిక‌గా న‌టించ‌బోతుంది. తాజాగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ని చిత్ర‌బృందం విడుద‌ల చేసింది. కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రాబోతున్న ఈ సినిమాతో ఎస్ విజయేంద్ర దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందించ‌బోతున్నాడు. ఈ సినిమా బ్యాండ్ ట్రూప్‌ నేప‌థ్యంలో రాబోతున్న‌ట్లు తెలుస్తుంది.

Related posts

రవితేజ కుటుంబం నుంచి మరో హీరో ఎంట్రీ

Ram Narayana

ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెర .. హైదరాబాద్‌లో రెహమాన్ మ్యూజిక్ ఫీస్ట్!

Ram Narayana

రేపు సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్ర‌ముఖుల భేటీ

Ram Narayana