తెలంగాణ వార్తలు

‘స్థానిక’ ఎన్నికలపై పొంగులేటి కీలక ప్రకటన

స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు ఉదయం కీలక ప్రకటన చేశారు. ఈ నెలాఖరులోగా స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని చెప్పారు. తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని, ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు జరుపుతామని మంత్రి తెలిపారు. ఈ విషయంపై రేపు క్యాబినెట్ భేటీలో చర్చిస్తామని వివరించారు. క్యాబినెట్ సమావేశం ముగిశాక ఎన్నికల తేదీలకు సంబంధించి వివరాలు వెల్లడిస్తామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కేవలం 15 రోజులు మాత్రమే గడువు ఉందని, పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి పొంగులేటి పిలుపునిచ్చారు.

Related posts

మూసీ బాధితులకు రూ.25వేల ప్రోత్సాహకం…

Ram Narayana

ఎన్నికల ఖర్చుపై నోరుజారిన కొండా మురళి …ఈసీకి బీజేపీ ఫిర్యాదు …

Ram Narayana

తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల వేతనాలు కట్ చేసి వారి ఖాతాలో వేస్తాం ..సీఎం

Ram Narayana