Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కేసీఆర్ కు కోపమొచ్చింది…..

రిబ్బన్ కట్ చేద్దామంటే కత్తెర లేదు…ఏకంగా రిబ్బన్ పీకిపారేసిన కేసీఆర్!
సిరిసిల్లా జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన
పలు అభివృద్ధి పనులు ప్రారంభం
డబుల్ బెడ్రూం ఇళ్లకు పూజా కార్యక్రమాలు
చేత్తోనే రిబ్బన్ లాగిపారేసిన కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. అయితే, డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభం సందర్భంగా ఊహించని పరిణామం చోటుచేసుకుంది. రిబ్బన్ కట్ చేయడానికి సీఎం కేసీఆర్ వచ్చారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అయితే రిబ్బన్ కట్ చేయడానికి కత్తెర దొరక్కపోవడంతో సీఎం కేసీఆర్ తీవ్ర అసహనానికి గురయ్యారు.

అధికారులు, సిబ్బంది ఒకర్నొకరు కత్తెర ఏదంటూ ప్రశ్నించుకోవడం సీఎం కేసీఆర్ ను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. కాసేపు వేచిచూసిన ఆయన కోపంతో రిబ్బన్ ను చేత్తోనే పీకి పారేశారు. ఆపై లబ్దిదారులతో కలిసి డబుల్ బెడ్రూం ఇంటిలోకి ప్రవేశించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Related posts

దత్తత వెళ్లాక పుట్టింటి ఆస్తిపై హక్కు ఉండదు.. తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు

Drukpadam

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కిసాన్ సంసద్ …భారీగా హాజరైన రైతుసంఘాల నేతలు…

Drukpadam

‘అగ్నిపథ్’ ఆగదు..లెఫ్టినెంట్ జనరల్ అనిల్‌పురి…

Drukpadam

Leave a Comment