తెలంగాణ రాజకీయ వార్తలు ..

సీఎం రేవంత్ వ్యాఖ్యలకు ఎంపీ ఈటెల కౌంటర్…

కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయని అది క్యాబినెట్ లో ఆమోదం పొందకుండానే కేసీఆర్ ఆలోచనల మేరకు నిర్మాణం చేశారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీజేపీ నేత ఎంపీ ఈటెల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు …కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్ట్ నిర్మాణం క్యాబినెట్ ఆమోదం లేకుండా జరగలేదని అప్పుడు తాను రాష్ట్ర ఆర్దికమంత్రిగా క్యాబినెట్ లో ఉన్నానని అన్నారు …దేశంలో ఇలాంటి సంఘటన ఎక్కడైనా జరిగిందా అని ఆయన అన్నారు …క్యాబినెట్ ఆమోదం లేకుండా నిర్మాణం జరిగిందని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు … కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ ముందుకు ఇటీవల ఈటెల రాజేందర్ హాజరై తన వాంగ్మూలం ఇచ్చారు …తాను కమిషన్ కు ఏమి చెప్పింది ఎవరు ఏమి అడిగింది మీడియా ముందు వెల్లడించారు …దీనిపై అప్పటి క్యాబినెట్ లో మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు …ఈటెల మాత్రం క్యాబినెట్ నిర్ణయం మేరకే కాళేశ్వరం నిర్మాణం జరిగిందని చెప్పడం అందుకు భిన్నంగా క్యాబినెట్ లో నిర్ణయం జరగ కుండానే ప్రాజెక్ట్ కట్టారని అది కేసీఆర్ బ్రెయిన్ చైల్డ్ అని సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించడం తెలిసిందే …

కేబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు కట్టిన సంఘటన దేశంలో ఎక్కడైనా ఉందా ? ఇలాంటి కీలక అంశాలపై కేబినెట్ ఆమోదం లేకుండా కేసీఆర్ ఎప్పుడూ నిర్ణయాలు తీసుకోలేదని ఈటెల చెప్పడం గమనార్హం .. ఆనాడు కేసీఆర్ కేబినెట్ లో ఉన్న ముగ్గురు మంత్రులు ఇప్పుడు మీ పక్కనే ఉన్నారు వారిని అడగండి నాడు జరిగిన విషయాలు స్పష్టంగా చెప్తారని ఈటెల పేర్కొన్నారు ..

Related posts

కాంగ్రెస్ కు పీజేఆర్ కొడుకు రాజీనామా…అదే దారిలో మరికొందరు ..

Ram Narayana

దేవుని ఎదుట భట్టి విక్రమార్క ఆరు గ్యారంటీల ప్రమాణం…

Ram Narayana

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కంగ్రెస్ దే హవా: న్యూస్ ఎక్స్ సర్వే

Ram Narayana