జాతీయ వార్తలు

చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన సీఎం స్టాలిన్…

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సోమవారం ఉదయం ఆయన మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆయనకు కళ్లు తిరిగినట్టు అనిపించింది. దీంతో, ఆయనను హుటాహుటిన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. స్టాలిన్ ను ఆసుపత్రిలో చేర్పించే సమయంలో ఆయన కుమారుడు, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయనిధి కూడా ఆయన వెంట ఉన్నారు. మరోవైపు, స్టాలిన్ అస్వస్థతకు గురయ్యారనే వార్తతో పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

తాజాగా, అపోలో మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ స్పందిస్తూ… ఆరోగ్యపరంగా స్టాలిన్ కు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. ఆయన లక్షణాలను పరిశీలించామని, అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు.

Related posts

ఏడాదికి 100 అణ్వాయుధాలు పోగేస్తున్న చైనా .. భారత్ కంటే మూడింతలకు పైగా వార్‌హెడ్‌లు!

Ram Narayana

అధికారులకు హోలీ పార్టీ ఇచ్చి, బిల్ రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన సీఎస్!

Ram Narayana

దేశంలోనే అతి పొడవైన యూ-గర్డర్ బెంగళూరులో ఆవిష్కరణ!

Ram Narayana