Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

హుజూరాబాద్ నుంచి ఈట‌ల భార్య పోటీ?.. ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన జ‌మున‌!

హుజూరాబాద్ నుంచి ఈట‌ల భార్య పోటీ?.. ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన జ‌మున‌
-హుజురాబాద్ పోటీలో నేను కూడా ఉన్నా
-ఎవరు పోటీ చేయాలన్నది ఇంకా నిర్ణయం తీసుకోలేదు
-నా భ‌ర్త‌ పోటీ చేసినా, నేను పోటీ చేసినా ఒక్కటే
-ఎవరికి అవకాశం వస్తే వాళ్లం పోటీ చేస్తాం
-రేప‌టి నుంచి 22 రోజుల పాటు ఈటల ప్రజా దీవెన యాత్ర
-ఆత్మ గౌరవ ప్రస్థానానికి ఇదే తొలి అడుగు అని ప్ర‌క‌ట‌న‌
-బత్తినవానిపల్లి శ్రీ హనుమాన్ దేవస్థానం నుండి ప్రారంభం

 

ఈటల రాజీనామా నేపథ్యంలో ఉపఎన్నిక అనివార్యమైన హుజురాబాద్ లో బీజేపీ చేరిన ఈటల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు . టీఆర్ యస్ కాంగ్రెస్ లనుంచి అభ్యర్థి ఎవరు బరిలో ఉంటారనే విషయం ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది . ఇప్పటివరకు రాజీనామా చేసిన ఈటల బరిలో ఉంటారని ప్రచారం జరుగుతుండగా ఇప్పుడు ఆయన భార్య ఈటల జమున పోటీచేస్తారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. దానికి బలం చేకూర్చేవిధంగా ఆమె మాట్లాడారు. కమలాపూర్ మండలం ప్రచారంలో పాల్గొన్న ఆమె ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు. పోటీలో నేను కూడా ఉండవచ్చు ఎవరికీ టికెట్ వస్తుందనేది నిర్ణయం జరుగుతుంది అనే ఆమె నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. దీనితో ఈటల రాజేందర్ పోటీపై చేయడంలేదని ప్రచారానికి బలం చేకూర్చినట్లు అయింది.

హుజూరాబాద్ నియోజ‌క వ‌ర్గానికి ఉప ఎన్నిక జ‌ర‌గాల్సి ఉన్న నేప‌థ్యంలో ప్ర‌ధాన పార్టీల‌న్నీ త‌మ అభ్య‌ర్థుల ఎంపిక‌పై క‌స‌రత్తు చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ నియోజక వ‌ర్గం నుంచి ఈట‌ల రాజేంద‌ర్ పోటీకి దిగ‌కుండా ఆయ‌న భార్య జ‌మున‌ను బ‌రిలోకి దింపుతార‌ని కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ ప్ర‌చారానికి బ‌లం చేకూర్చేలా జ‌మున ప‌లు వ్యాఖ్య‌లు చేయ‌డం ఆస‌క్తి రేపుతోంది.

హుజురాబాద్ పోటీలో తాను కూడా ఉన్నట్లు జ‌మున వ్యాఖ్యానించారు. అయితే, ఎవరు పోటీ చేయాలన్నది ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. త‌న భ‌ర్త‌ పోటీ చేసినా, తాను పోటీ చేసినా ఒక్కటేనని చెప్పారు. తెలంగాణ ఉద్యమం స‌మ‌యంలోనూ తాను తన భర్త ఈటలను వెనకుండి నడిపించానని ఆమె తెలిపారు. అలాగే, ప్రతి ఎన్నికల్లో ఈటల ముందుండి ప్రచారం చేశానని అన్నారు. త‌మ‌ ఇద్దరిలో ఎవరికి అవకాశం వస్తే వాళ్లం పోటీ చేస్తామ‌ని చెప్పారు. ఉప ఎన్నిక నేప‌థ్యంలో హుజూరాబాద్‌లోని పలు వార్డుల్లో ఆమె ప్ర‌చారం చేస్తున్నారు. రేప‌టి నుంచి ఈటల కూడా పాదయాత్ర చేయ‌నున్న విషయం తెలిసిందే.

 

ఆత్మ గౌరవ ప్రస్థానానికి ఇదే తొలి అడుగు: ఈట‌ల రాజేంద‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌
రేప‌టి నుంచి పాద‌యాత్ర షురూ
ప్రతిక్షణం వెంటనడిచిన మీకు అనుక్షణం అండగా ఉంటా
22 రోజుల సుదీర్ఘ ప్రజా దీవెన యాత్ర
బత్తినవానిపల్లి శ్రీ హనుమాన్ దేవస్థానం నుండి ప్రారంభం

 

తెలంగాణ మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రేప‌టి నుంచి పాద‌యాత్ర ప్రారంభిస్తున్న‌ట్లు చెప్పారు. ‘ప్రతిక్షణం వెంటనడిచిన మీకు అనుక్షణం అండగా ఉండడానికి, ప్రాణం పంచే ప్రజల ప్రత్యక్ష దీవెనలు అందుకోవడానికి, 22 రోజుల సుదీర్ఘ ప్రజా దీవెన యాత్రకు జులై 19 నుండి శ్రీకారం చుడుతున్నాను’ అని ఆయ‌న చెప్పారు.

‘ఉదయం 7.30 ని.లకు కమలాపూర్ మండలం బత్తినవానిపల్లి శ్రీ హనుమాన్ దేవస్థానం నుండి ప్రారంభం అయ్యే ఈ ప్రజా పాదయాత్రకి మీ ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను. నా అడుగులకు మీ అండదండలు కావాలి. నా ప్రస్థానానికి మీ ప్రేమాభిమానాలు కావాలి. ప్రజా దీవెన యాత్రకి మీ అందరి దీవెనలు కావాలి. ఆత్మ గౌరవ ప్రస్థానానికి ఇదే తొలి అడుగు’ అని ఈట‌ల రాజేంద‌ర్ ప్ర‌క‌టించారు. కాగా, హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక‌ జ‌ర‌గాల్సి ఉన్న విష‌యం తెలిసిందే.

Related posts

కవిత, బండి సంజయ్.. ఆప్యాయ పలకరింపులు…

Drukpadam

పార్లమెంట్ సమావేశాలు వాష్ అవుట్ కావడంపై వెంకయ్యనాయుడు కంట కన్నీరు!

Drukpadam

తుమ్మల రాజకీయ చాణిక్యం ఫలిస్తుందా …?

Drukpadam

Leave a Comment