తెలంగాణ వార్తలు

రాసిపెట్టుకోండి 2034 జూన్ వరకు తెలంగాణలో కాంగ్రెస్ దే అధికారం..సీఎం రేవంత్

హైద్రాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వరంలో తాజ్ కృష్ణ లో జరిగిన ‘మీట్ ది ప్రెస్’కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పాల్గొని మాటాడారు ..మీడియా ప్రతినిధులు అడిగిన అనేక ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇచ్చారు ..రాసిపెట్టుకోండి 2034 వరకు కాంగ్రెస్ దే అధికారమని ఘంటాపధంగా చెప్పారు ..ఈ సమావేశానికి మోడరేటర్ గా హిందూ పొలిటికల్ ఎడిటర్ రవికాంత్ రెడ్డి వ్యవరించగా , మీడియా అకాడమీ చైర్మన్ కే .శ్రీనివాస్ రెడ్డి …హైద్రాబాద్ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు ..

తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చి ఇచ్చిన మాట సోనియా గాంధీ నెరవేర్చేందుకు రాజకీయంగా నష్టపోయినా లెక్కచేయలేదు..ఆనాడు యూపీఏ-1,యూపీఏ-2 లో రైతులు,రైతుల సంక్షేమం కోసం కృషి చేసింది.. 2004 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్, 1300 కోట్ల విద్యుత్ బకాయిల మీద మొట్ట మొదటి సంతకం చేశారు.. 73 వేల కోట్ల రుణమాఫీని మన్మోహన్ సింగ్ అమలు చేశారు..కనీస మద్దతు ధరను ప్రకటించి రైతులకు మేలు చేసింది కాంగ్రెస్.. జలయజ్ఞం ద్వారా సాగునీటిని అందించేందుకు కృషి చేసింది కాంగ్రెస్..కల్వకుర్తి , బీమా,నెట్టెంపాడు, ఆర్డీఎస్, ఇందిరా సాగర్, ఎస్ఎల్బీసీ, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులు చేపట్టింది కాంగ్రెస్.. ఎస్సారెస్పీ, మిడ్ మానేరు, శ్రీపాద ఎల్లంపల్లి ఇలా చాలా ప్రాజెక్టులు చేపట్టింది..

హైదరాబాద్ లో తాగు నీటి సమస్య వచ్చినపుడు కుండలతో నిరసన తెలిపి,చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారు..కృష్ణా జలాలను నగరానికి తరలించేలా చేసి జంట నగరాల దాహార్తిని తీర్చారు.. హైదరాబాద్ ఐటీ, నాలెడ్జ్ సిటీగా మారిందంటే ఆనాటి కాంగ్రెస్పాలసీలే కారణం..
విద్యుత్ కొరత ఉన్న జంట నగరాలకు నిరంతర విద్యుత్ అందించడం వల్లే దిగ్గజ సంస్థలు నగరానికి తరలి వచ్చాయి.. దేశంలో బల్క్ డ్రగ్స్ లో 40 శాతం మన నగరం నుంచి ఉత్పత్తి అవుతున్నాయి..

అమెరికన్ ఎయిర్ లైన్స్, మెక్ డొనాల్డ్ ఇలా ప్రపంచంలోని 70 శాతం ఫార్చ్యూన్ 500 కంపెనీలు హైదరాబాద్ లో జీసీసీలు ఏర్పాటు చేసుకున్నాయి.. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ గా తయారు కావడం వెనక కాంగ్రెస్ కృషి ఉంది.. తెలంగాణలో 65 శాతం ఆదాయం హైదరాబాద్ నగరం నుంచే వస్తోంది..

25 లక్షల అసైన్డ్, 10 లక్షల ఎకరాల పోడు భూములను పంచిన ఘనత ఇందిరమ్మది..
దున్నే వాడికే భూమి అనే నినాదాన్ని పకడ్బందీగా అమలు చేసిన ఘనత పీవీ, ఇందిరా గాంధీలది..

జైపాల్ రెడ్డి కృషి వల్లే హైదరాబాద్ కు మెట్రో వచ్చింది.ఇది కెసీఆర్ చెరిపేస్తే చెరిగేది కాదు..
ఆనాటి కాంగ్రెస్ పదేళ్ల పాలన, కెసీఆర్ పదేళ్ల పాలనను పోల్చి చూడండి..60 వేల కోట్ల మిగులుతో రాష్ట్రాన్ని అప్పగిస్తే పదేళ్లలో 8 లక్షల 11 వేలకోట్ల అప్పులతో వాళ్లు మాకు అప్పగించారు..ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో పాతాళంలోకి పడిపోయే స్థితిలో రాష్ట్రాన్ని మాకు అప్పగించారు..

వారు కట్టిన కమాండ్ కంట్రోల్, సచివాలయం, ప్రగతి భవన్ వల్ల ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా.?కాళేశ్వరం లేకపోయినా మా ప్రభుత్వంలో 2 కోట్ల 85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసి దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచింది..
బీఆరెస్ హయాంలో ఒక్క కొత్త యూనివర్సిటీనైనా తీసుకొచ్చారా.?పేదలకు విద్య, రైతులకు వ్యవసాయాన్ని, మహిళలకు రాజ్యాధికారాన్ని దూరం చేశారు.. 1 లక్షా 87 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు..ఉస్మానియా ఆసుపత్రిని కట్టలేదు, టిమ్స్ లు పూర్తి చేయలేదు.. దశ సరిగ్గా లేని వాడి కోసం వాస్తు పేరుతో దిశ మారిస్తే ప్రయోజనం ఉంటుందా.?
సొంత చెల్లిని, మాగంటి తల్లిని అవమానించిన వాడు ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు.? ద్రుతరాష్టుడు కళ్ళకు గంతలు కట్టుకున్నట్లు కెసీఆర్ వ్యవహరిస్తున్నారు..

మా ప్రభుత్వంలో 7100 కోట్లు ఉచిత బస్సు కోసం ఖర్చు చేశాం.. ఆర్టీసీని నష్టాల నుంచి లాభాల వైపు నడిపించాం,రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచాం..
3 వేల కోట్లతో ఉస్మానియా ఆసుపత్రిని నిర్మిస్తున్నాం,100 ఎకరాల్లో హైకోర్టు నిర్మిస్తున్నాం..
రేషన్ కార్డులు, 500 లకే గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం.. 21 వేల కోట్లు రైతు రుణమాఫీ చేశాం , తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్లు రైతు భరోసా అందించాం..

కెసీఆర్ ప్రారంభించిన ఏ ఒక్క పథకాన్ని ఆపకుండా కొనసాగిస్తున్నాం..బీసీకులగణన చేసి కేంద్రం జనగణనతోపాటు కులగణన చేసేలా చేశాం..యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, పోలీస్ స్కూల్ ఏర్పాటు చేశాం.యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం..
హైదరాబాద్ నగరానికి పదేళ్లలో ఒక్క చుక్క అదనంగా తాగునీరు తీసుకొచ్చారా.? మేం వచ్చాక 20 టీఎంసీల గోదావరి జలాలు తెచ్చేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నాం..
మేం వచ్చాక హైదరాబాద్ కు 70 శాతం జీసీసీలు ఏర్పాటయ్యాయి.. కిషన్ రెడ్డి గుజరాత్ కు గులాంగా మారి రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను అడ్డుకుంటున్నారు..

మేం అధికారంలోకి వచ్చాక 20 వేలకు పైగా నోటిఫికేషన్లు వేశాం, 60 వేలకు పైగా ఉద్యోగాలకు భర్తీ చేశాం.. ఎవరిది అగ్రికల్చర్?ఎవరిది డ్రగ్స్ కల్చర్?ఎవరిది పబ్ కల్చర్?ఎవరిది సామాన్యులతో కలిసే కల్చర్?ఎవరు సినీ తారలతో తిరిగే కల్చర్?ఎవరిది సినీ కార్మికుల కోసం కృషి చేసే కల్చర్?మీరే ఆలోచించండి..మళ్ళీ చెపుతున్నా రాసిపెట్టుకోండి 2034 జూన్ వరకు తెలంగాణలో పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు…

కేటీఆర్ జీవితంలో అధికారం అనే రేఖ లేదు..: సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy Slams KTR Compares to Sreeleela Item Song
  • హైదరాబాదులో మీట్ ది ప్రెస్ కార్యక్రమం
  • జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానాలు
  • కేటీఆర్ దశ బాగా లేదు… కేసీఆర్ ఎన్ని దిశలు మార్చినా ప్రయోజనం లేదని ఎద్దేవా
  • పుత్ర వాత్సల్యంతో కేసీఆర్ ధృతరాష్ట్రుడిలా మారారని విమర్శలు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేటీఆర్ జాతకంలో అధికార యోగం అనే రేఖే లేదని, ఆయన దశ బాగోలేనప్పుడు తండ్రి కేసీఆర్ ఎన్ని దిశలు మార్చినా ప్రయోజనం ఉండదని ఎద్దేవా చేశారు. పుత్ర వాత్సల్యంతో కేసీఆర్ ధృతరాష్ట్రుడిలా మారారని ఆయన అభివర్ణించారు. రేవంత్ రెడ్డి ఇవాళ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్‌’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేటీఆర్ ఎన్నికల ప్రచారం చూస్తుంటే ‘పుష్ప’ సినిమాలోని శ్రీలీల ఐటమ్ సాంగ్‌ గుర్తుకొస్తోందని అన్నారు. 

ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అధోగతి పాలు చేశారని ఆరోపించారు. “వ్యవసాయం, విద్య, వైద్యం.. ఇలా ఏ రంగంలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం విజయం సాధించలేదు. వేల కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇచ్చారా? కానీ మా ప్రభుత్వం కాళేశ్వరం లేకుండానే రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి చేసి చూపించింది” అని తెలిపారు. కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీసీ, భీమా, నెట్టెంపాడు వంటి కీలక ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందని, ప్రజలకు ఉపయోగపడని కమాండ్ కంట్రోల్ సెంటర్, ప్రగతిభవన్, సచివాలయం వంటి భవనాలు మాత్రమే నిర్మించారని విమర్శించారు.

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రవేశపెట్టిన ఏ పథకాన్నీ రద్దు చేయలేదని, వాటిని కొనసాగిస్తూనే కొత్త హామీలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఎస్సీ వర్గీకరణ, కులగణన, రాష్ట్ర గీతం వంటి హామీలను నెరవేర్చామని గుర్తుచేశారు. దేశంలో ఎస్సీ వర్గీకరణ చేపట్టిన తొలి రాష్ట్రంగా తెలంగాణను నిలిపామని, ఎవరూ సాహసించని కులగణనను ప్రారంభించామని గర్వంగా చెప్పారు.

రాష్ట్రంలోని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై కూడా రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ రెండు పార్టీలది ఫెవికాల్ బంధమని, రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలను గుజరాత్‌కు తరలించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సెమీ కండక్టర్ కంపెనీ తరలింపునకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఆదేశించినా, కేంద్రం ఎందుకు దర్యాప్తు ప్రారంభించడం లేదని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ తెచ్చుకుంటే దేశం మొత్తం గెలిచినట్లేనని సవాల్ విసిరారు.

అభివృద్ధి కోసం చంద్రబాబు, వైఎస్ విధానాలను ఫాలో అవుతున్నాం: రేవంత్ రెడ్డి

Revanth Reddy Says Following Chandrababu YSR Policies for Telangana Growth

తెలంగాణ అభివృద్ధికి ఉమ్మడి రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రులు చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవలంభించిన విధానాలను తమ ప్రభుత్వం కొనసాగిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వారి హయాంలో ఐటీ, ఫార్మా రంగాలకు విశేష ప్రాధాన్యం దక్కిందని గుర్తుచేశారు. ఐటీ రంగానికి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి వేసిన పునాది హైదరాబాద్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు ఆదివారం హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్‌ ది ప్రెస్‌’ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్‌ ముఖ్యమంత్రుల నిర్ణయాలు హైదరాబాద్‌ అభివృద్ధికి బాటలు వేశాయని రేవంత్ రెడ్డి చెప్పారు. నగరం నాలెడ్జ్‌ సిటీగా మారిందంటే కారణం గతంలో కాంగ్రెస్‌ సీఎంలు తీసుకున్న నిర్ణయాలేనని అన్నారు. అభివృద్ధిలోనే కాదు.. సంక్షేమంలోనూ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు తమ ముద్ర వేశారని వివరించారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో వచ్చిన శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు, ఓఆర్‌ఆర్‌ కూడా కీలకంగా మారాయన్నారు.

గతంలో కాంగ్రెస్‌ హయాంలోనే అనేక కేంద్ర సంస్థలు హైదరాబాద్ లో ఏర్పాటయ్యాయని చెప్పారు. దేశానికి వచ్చిన వాటిలో 70 శాతం నగరానికే వచ్చాయని, ప్రపంచాన్ని శాసించే చాలా సంస్థలు హైదరాబాద్‌ లో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం జీసీసీలు, డేటా సెంటర్లకు హైదరాబాద్‌ హబ్‌గా మారిందని గుర్తుచేశారు. 2004-2014 మధ్య అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు హైదరాబాద్‌ అభివృద్ధికి పాటుపడ్డాయని రేవంత్‌ రెడ్డి తెలిపారు.

Related posts

పాడి కౌశిక్ రెడ్డిపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఫిర్యాదు!

Ram Narayana

ఎల్బీ నగర్ డీసీపీపై కాంగ్రెస్ నేత మధుయాష్కీ తీవ్ర ఆగ్రహం…

Ram Narayana

బీహార్ కు సీఎం రేవంత్ రెడ్డి …

Ram Narayana