తెలంగాణ వార్తలు

మరి కొద్దీ గంటల్లోనే ఫలితం …జూబ్లీహిల్స్ పై బెట్టింగులు

మరి కొద్దీ గంటల్లోనే ఫలితం …జూబ్లీహిల్స్ పై బెట్టింగులు
ఉత్కంఠత జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఫలితం..
యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు..
ఉదయం 8 గంటలకు ప్రారంభంకానున్న కౌంటింగ్‌ ప్రక్రియ..
10 రౌండ్లలో తేలనున్న ఉప ఎన్నిక ఫలితాలు..
కౌంటింగ్‌ కోసం మొత్తం 42 టేబుల్స్‌ ఏర్పాటు..

ఒకటో నెంబర్‌ పోలింత్‌ బూత్‌ షేక్‌పేట డివిజన్‌ నుంచి ప్రారంభమై ఎర్రగడ్డతో ముగియనున్న కౌంటింగ్‌

ఈనెల 11 వ తేదీన జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం మరి కొద్దీ గంటల్లో తేలనుంది ..అయితే అనేక సర్వేలు అధికార కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నదది చెప్పిన ..ప్రతిపక్షాలకు ఎక్కడో ఒకచోట ఉన్న ఆశ …దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది …ప్రజాభిప్రాయం పోలింగ్ మిషన్లలో భద్రంగా ఉంది ..హోరాహోరీ సాగిన ప్రచారంలో తామే గెలుస్తామని అటు బిఆర్ యస్ ధీమాగా ఉండగా , లేదు తామే గెలుస్తామని తమ అభివృద్ధి కార్యక్రమాలు తమనే గెలిపిస్తాయని ధీమాతో అంటున్నారు..కాంగ్రెస్ కూడా ఇక్కడ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోని పనిచేసింది .సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రచారం చేశారు..ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్ కే అనుకులామ్ అని చెప్పాయి…

శుక్రవారం ఉదయం 8 గంటలకు ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం కానున్నది ..రెండు గంటల్లోనే ఎవరు విజేత అనేది దాదాపు తేలనుంది ..4 లక్షలకు పైగా ఓటర్లు ఉండగా కేవలం సుమారు 60 శాతంకు కొద్దిగా అటు ఇటుగా ఓట్లు పోలయ్యాయి…మొత్తం కౌంటింగ్ కోసం 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు ..10 రౌండ్లలో ఎన్నిక ఫలితం బయటకు వస్తుంది ..

Related posts

తెలంగాణలోని మహబూబ్ నగర్‌ జిల్లాలో భూప్రకంపనలు

Ram Narayana

ఫోన్ ట్యాపింగ్ విచారణ ఏమైనా డైలీ సీరియలా ? : ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం

Ram Narayana

తెలంగాణలో రూ.5 వేల కోట్లతో రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ లు!

Ram Narayana