హిడ్మా ఎన్కౌంటర్ పై దేశవ్యాపిత చర్చ
మోస్ట్ వాంటెడ్ హిద్మపై 1 .80 కోట్ల రివార్డ్ ,భార్యపై 50 లక్షలు
విజయవాడలో పట్టుకొని మారేడుమిల్లి అడవుల్లో కాల్చారని ఆరోపణ
ఇది రాజ్యహింసలో భాగంగా జరిగిన హత్యగా విమర్శలు
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మడవి హిడ్మాను పోలీసులు ఎన్కౌంటర్ చేయటంపై దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చ జరుగుతుంది. గతంలో ఏ మావోయిస్టు పార్టీ నాయకుడికి జరగనంత ప్రచారం , చూపనంతా సానుభూతి హిడ్మా పట్ల చూపడంపై అధికారవర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి .. పార్టీలోని అత్యంత చురుకైన నాయకుడిగా ,ఇంకా ఎంతో భవిష్యత్ ఉన్న యువనేతగా, పెద్దగా చదువు రాకపోయినా ఐదు భాషలమీద పట్టు సంపాదించిన దిట్టగా, కార్యశూరుడుగా ,లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే గురితప్పని వేటగాడిగా అతి తక్కువ కాలంలోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు … అతి ముఖ్యమైన బెటాలియన్ కు కమాండర్ గా వ్యవహరిస్తున్న హిడ్మా ఎన్కౌంటర్ పట్ల రాజకీయ పార్టీలు స్పందించాయి .ఇది భూటకపు ఎన్కౌంటర్ అని హత్యను ఖండించాయి…నిరాయుధులను పట్టుకొని కాల్చారని ఇది అత్యత ఘరామైన,దారుణాతి దారుణమైన రాజ్యహింసగా పేర్కొంటున్నాయి.. మావోయిస్టు పార్టీని 2026 మార్చి నాటికి లేకుండా చేస్తామని కేంద్రమంత్రి అమిత్ షా ప్రకటన చేసిన నేపథ్యంలో ఆపరేషన్ కగర్ పేరుతో జరుగుతున్న ఈ పోలీస్ కుంబింగ్ వల్ల మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పార్టీ కోలుకొని విధంగా నష్టపోయింది.. అనేక మంది పార్టీ సైద్ధాంతిక విధానాలపట్ల విభేదించి ప్రభుత్వం ముందు లొంగిపోయారు …మరి కొంతమంది అదే ఆలోచనతో ఉన్నారని వార్తలు వస్తున్నాయి… మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లోజుల కోటేశ్వరరావుతో సహా అనేకమంది ముఖ్య నేతలను భద్రతా దళాలు మట్టుబెట్టాయి..దీంతో పార్టీకి తీవ్ర నష్టం జరిగింది .. ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కేంద్ర కమిటీ సభ్యులు మరణించిన వారిలో ఉన్నారు .. దీంతో నక్సలిజాన్నిలేకుండా చేస్తామని కేంద్ర హోమ్ మంత్రి ప్రకటన నెరవేరుతున్నట్టుగా భావిస్తున్నారు. భూమి, భుక్తి విముక్తి కోసం సాగుతున్న ఈ పోరాటంలో చేతినిండా పని కడుపునిండా తిండి, ఉండటానికి ఇల్లు లేకుండా మావోయిస్టులను అంతమొందించడం పాలకులకు సాధ్యమవుతుందా అనే ప్రశ్నలు కూడా ఈసందర్భంలో తలెత్తుతున్నాయి ఎన్కౌంటర్ల పేరుతో మావోయిస్టులను పట్టుకొచ్చి కాల్చి వేస్తున్నారనే విమర్శలను పాలకవర్గాలు మూటకట్టుకుంటున్నాయి ..గ్రేహాండ్స్ పోలీసులు. భద్రతా దళాలు చేస్తున్న దారుణ మారణకాండను కొనసాగుతున్నారని వివిధ రాజకీయ పార్టీలు ప్రధానంగా లెఫ్ట్ పార్టీలు ప్రజా సంఘాలు మేధావులు ఖండిస్తున్నారు. ఈ దారుణ ఎన్కౌంటర్లను , పట్టుకొచ్చి కాల్చివేయడాన్ని ఆపాలని డిమాండ్ చేస్తున్నారు .. అదే సందర్భలో మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసేందుకు అవకాశం ఇవ్వాలని అందుకోసం కొంత సమయం అవసరమని చెబుతున్నప్పటికీ అదేం లేకుండా రాజ్యం తమ చేతిలో ఉందని , వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ నక్సల్ కార్యకలాపాలను మట్టు పెట్టాలని చూస్తున్న పాలకుల వైఖరిపై గళాలు విప్పుతున్నారు …సుక్మా జిల్లాలోని పుల్వార్తి గ్రామంలో హిడ్మా ఆయన భార్య రాజే అంత్యక్రియలకు నిర్బంధాలను లెక్క చేయకుండా వందలాది మంది గిరిజనులు తరలి రావడమే ఇందుకు నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..
ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన జరగకుండా ,పేదల చేతుల్లోకి భూమి రాకుండా ,తినడానికి తిండి ,చేసుకోవాడనికి పని కల్పించకుండా ప్రజలను నిర్బంధాల ద్వారా అణిచివేస్తామంటే కుదిరే పనికాదు ..అందరికి తిండి ,బట్ట ,ఉండేందుకు ఇల్లు గల పరిస్థితులు నెలకొనాలి …ఎవరో కొందరు పెట్టుబడిదారులు ,బహుళజాతి సంస్థలకు దోచిపెట్టేందుకు మొత్తం అడవులను ఖాళీచేయిస్తమెంటే కుదిరే పని కాదు …అంతే కాకుండా అడవి పెత్తనం గిరిజనులదే ..ఆమేరకు రాజ్యాంగం ప్రజల నుంచి మరో రూపంలో ప్రతిఘటన వస్తుంది …ఇది ఇక్కడే కాదు ప్రపంచ వ్యాపితంగా జరుగుతున్న సత్యం …!
హిడ్మా ఎన్కౌంటర్ పై కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్..
ఈనెల 23’న దేశ వ్యాప్త నిరసన దినం
కేంద్రకమిటీ సభ్యుడు , దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ మాడ్వి హిడ్మా ఎన్కౌంటర్ బూటకమని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పేర్కొన్నది… హిడ్మా మర్శయు హిడ్మా భార్య కామ్రేడ్ రాజే తో పాటు కొంతమంది విజయవాడలో నవంబర్ 15న నిరాయుధంగా ఉన్నవారిని పట్టుకుని క్రూరంగా హతమార్చి మారెడుమిల్లి ఎన్ కౌంటర్ పేరిట కట్టుకథ అల్లారని పేర్కొన్నది ..ఏఓబీ రాష్ట్రకమిటీ సభ్యుడు కామ్రేడ్ టెక్ శంకర్ మరికొంత మందిని పట్టుకొని కాల్చి చంపి రంపచోడవరం ఏరియాలో ఎన్కేంటర్ జరిగిందని కట్టుకథ అల్లారని ఆరోపించింది ..ఈ క్రూర హత్యాకాండ కు వ్యతిరేకం గా నవంబర్ 23’న దేశ వ్యాప్త నిరసన దినం గా పారించాలని పిలుపునిస్తున్నాం
