తెలంగాణ వార్తలు

సీనియర్ జర్నలిస్టు ఫజల్ మృతి…షాక్ అయిన మిత్రులు

సీనియర్ జర్నలిస్టు ఫజల్ మృతి…షాక్ అయిన మిత్రులు

సీనియర్ జర్నలిస్ట్ ఎందరికో ఆదర్శప్రాయుడు ,జర్నలిజం లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న ఫజల్ ఉల్ రహ్మాన్ మృతికి పాత్రికేయలోకం దిగ్బ్రాంతికి గురైంది ..ఇటీవల వరకు ఆరోగ్యంగా ,హుషారుగా కనిపించిన ఫజల్ మాయదారి క్యాన్సర్ తో మృతి చెందడంపై జర్నలిస్ట్ సమాజాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేట్లుగా చేసింది .ఎంతో అనుభవం,ఎంతో మందికి జర్నలిస్టులకు పాఠాలు నేర్పిన ఫజల్ మృతి జర్నలిస్ట్ లోకానికి తీరని లోటు …

సీనియర్ జర్నలిస్టు ఫజల్ ఉల్ రహ్మాన్(65) అకాల మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(TUWJ) ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది. ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, సాక్షి, దిశ తదితర పత్రికలలో వివిధ హోదాల్లో దాదాపు 38 సంవత్సరాలకు పైగా పనిచేసి, ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా ‘ప్రతిపక్షం’ డిజిటల్ దినపత్రికను నిర్వహిస్తున్న ఫజల్ హఠాత్తుగా క్యాన్సర్ కాటుకు గురై ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. దాదాపు మూడున్నర దశాబ్దాలుగా ఉమ్మడి రాష్ట్రంలో ఏపీయుడబ్ల్యూజే కు, ప్రత్యేక రాష్ట్రంలో టీయూడబ్ల్యూజే సంఘాలకు ఆయన అందించిన సేవలు చిరస్మరనీయం.
ఫజల్ స్వస్థలం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్. వారం రోజుల క్రితం నిమ్స్ ఆసుపత్రిలో చేరిన ఫజల్ కు మెరుగైన చికిత్స అందేలా ఏంతో కృషి చేసాం. అయినా ఫలితం దక్కలేదు. గత కొంతకాలంగా ఆర్థిక కష్టాలను అనుభవిస్తున్న ఫజల్ ఉల్ రహ్మాన్ కుటుంబానికి టీయూడబ్ల్యూజే అండగా నిలిచి, ప్రభుత్వ పరంగా సహాయం అందేలా కృషి చేస్తుందని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు కె .విరాహత్ అలీ , కె .రామనారాయణలు తెలిపారు ..

ఫజల్ మృతి చెందారన్న విషాదకర వార్త తెలిసిన వెంటనే రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ నిమ్స్ లో ఉన్న మృత దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు .కుటుంబ సభ్యులను ఓదార్చి దైర్యం చెప్పారు ..

ఫజల్ మృతి పట్ల మీడియా అకాడమీ చైర్మన్ ,ఐజేయూ అధ్యక్షులు కె .శ్రీనివాస్ రెడ్డి ,ఐజేయూ స్టీరింగు కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్ ,ఎం ఏ మాజీద్ కార్యదర్శి వై నరేందర్ రెడ్డి ,కార్యవర్గ సభ్యులు కె .సత్యనారాయణ ,నగునూరి శేఖర్ ,స్టీరింగ్ కమిటీ సభ్యులు మజీద్ ,టీయూడబ్ల్యూజే డిప్యూటీ జనరల్ సెక్రటరీ కె .రాములు , కార్యదర్శులు , వి .యాదగిరి , కె .శ్రీకాంత్ రెడ్డి ,కోశాధికారి ఎం .వెంకటరెడ్డి తదితరులు సంతాపం తెలిపారు .

Related posts

ఆ కమిషన్ నివేదిక వచ్చాకే ఉద్యోగ నోటిఫికేషన్లు: సీఎం రేవంత్ రెడ్డి

Ram Narayana

సుప్రీం ఆదేశాలతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన ప్రభాకర్ రావు ..

Ram Narayana

ఈనెల 4 వ తేదీన తుంగతుర్తిలో మాజీమంత్రి దామోదర్ రెడ్డి అంత్యక్రియలు..

Ram Narayana