జాతీయ రాజకీయ వార్తలు

సిపిఐ నూరేళ్ళ చరిత్ర ఒక అద్భుత ప్రయాణం

భారతదేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం సిద్ధించిన అనంతరం కమ్యూనిస్టు పార్టీ చట్టసభలలో  ప్రవేశించింది. దేశంలో సోషలిజం తీసుకురావాలని ప్రయత్నాలు ప్రారంభించింది. చట్ట సభల్లోనూ బయట ఉద్యమాలకు బాటలు వేసింది. కార్మికుల, రైతుల పీడిత వర్గాల తరఫున తన గొంతు వినిపించింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీని నాటి పాలకులు దెబ్బతీసే ప్రయత్నాలు అనేకం చేశారు. అనేక మందిని ప్రలోభాల గురి చేశారు. అయినప్పటికీ కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ముందుకు తీసుకు పోయేందుకు లక్షలాదిమంది కామ్రేడ్స్ కష్టాలను సైతం లెక్కచేయకుండా పనిచేశారు. కమ్యూనిస్టుల ఉద్యమాలు త్యాగాలు ఫలితంగా నాటి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చట్టాలు చేయాల్సి వచ్చింది. నేడు కార్మిక వర్గం అనుభవిస్తున్న అనేక చట్టాలు నాటి కమ్యూనిస్టుల ఉద్యమ ఫలితమే . వాటిని తుంగలో తొక్కి కార్మిక వర్గ హక్కులను హరించేందుకు నేడు మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం పనిచేస్తుంది. కార్మికులు ఉద్యమాల ద్వారా సాధించుకున్న అనేక చట్టాలను రద్దుచేసి పెట్టుబడిదారులకు బహుళ జాతి కంపెనీలకు ఉపయోగపడే విధంగా చట్టాలు సవరించింది. దీనిపై కార్మిక వర్గం కన్నెర్ర చేస్తుంది . కార్మిక వర్గానికి వెన్నుదన్నుగా కమ్యూనిస్టు పార్టీలు నిలిచాయి.
మతతత్వ ఎజెండాతో ప్రజలను విడదీసి కేంద్రంలో బిజెపి సర్కార్ పాలన సాగిస్తుంది. మోడీ ఫాసిస్టు విధానాలు ప్రజలకు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారాయి . ప్రజల ఆకలి ఎజెండా కాకుండా మత ఎజెండాతో ముందుకు పోతుంది. కార్మిక రైతు ఉద్యమాలకు యువజన విద్యార్థులకు రక్షణ కరువైంది. వామపక్షాల మద్దతుతో ఢిల్లీలో జరిగిన సుదీర్ఘ రైతు ఉద్యమం మోడీ మెడలు వంచి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయించుకోగల్గింది .

కమ్యూనిస్టుల ఐక్యత ఆవశ్యం …

భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడ్డ తీరు ఎదిగిన విధానం చాలా గొప్పగా ఉన్నప్పటికీ సిద్ధాంత రాద్ధాంతాలతో ఉన్నా కాల క్రమంలో చీలికల పేలికలతో బలహీన పడుతూ వచ్చింది. నేటి పాలకులు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు కమ్యూనిస్టుల ఐక్యత ,ఆవశ్యకత అవసరం ఏర్పడింది .

1964 లో సిపిఐ సిపిఎం రెండుగా విడిపోవడం ఆ తర్వాత 1967లో సాయుధ పోరాట మే  మార్గమని కొందరు  నక్సలిజం పంథాను చేపట్టడం, అందులో కూడా రకరకాల సిద్ధాంతాల చర్చలతో చీలికలు పేలికలుగా కావడం కమ్యూనిస్టులు బలహీనపడటానికి కారణాలుగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ త్రిపుర కేరళ బీహార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో కమ్యూనిస్టులు బలంగా ఉన్నప్పటికీ ఉత్తర భారతదేశం లో బలహీనత పార్టీ అనుకున్నంత స్థాయిలో ఎదగలేకపోయింది. సిపిఎం మూడు రాష్ట్రాలలో వామపక్ష  ప్రభుత్వాలను నడిపినప్పటికీ ఒక కేరళ మినహా మిగతా రాష్ట్రాల్లో బలహీనపడటం దేశ వామపక్ష ఉద్యమానికి తీరని లోటుగా మిగిలింది. సాయుధ పోరాటం ద్వారానే దేశంలో సోషలిజం తెస్తామని మావోయిస్టులు అటవీ బాట పట్టిన ఫలితం లేకుండా పోయింది. వారిని తుద ముట్టించాలని కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకొని అనేకమంది కామ్రేడ్స్ ను మట్టు పెట్టింది. ప్రభుత్వ నిర్బంధాలతో అనేకమంది కామ్రేడ్స్ లొంగిపోయారు.

ప్రస్తుతం మోడీ నాయకత్వంలో ఉన్న బిజెపి ప్రభుత్వం తన ఫాసిస్టు విధానాల ద్వారా ప్రజల హక్కులను ప్రధానంగా కార్మిక కర్షకులు హక్కులను హరించి వేస్తుంది. రాజ్యాంగం లో ఉన్న లౌకిక ప్రజాస్వామ్యక విలువలకు తిలోదకాలు ఇచ్చే ప్రయత్నాలకు పునుకుంటుంది. అసలు రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రలు చేస్తుంది. రాజ్యాంగ పరిరక్షణ కోసం అనేకమంది గళం విప్పుతున్నారు. కమ్యూనిస్టుల వాణి చట్టసభల్లో లేకుండా చేయాలని పాలకులు, కుట్రలు పన్నుతున్నారు. ఈ ధోరణి పీడిత తాడిత ఉద్యమాలకు తీరని నష్టం జరుగుతుంది. ఇందుకోసం కమ్యూనిస్టులు ఐక్యత అవసరం ఆవశ్యకత మరింత పెరిగింది. ఖమ్మంలో జరుగుతున్న సిపిఐ 100 సంవత్సరాల పండుగ సందర్భంగా దేశ ప్రజానీకానికి కమ్యూనిస్టుల ఐక్యత ప్రజా ఉద్యమాలపై ఒక స్పష్టమైన సందేశం ఇస్తారని ఆశిద్దాం… !

Related posts

ఆలయ ప్రారంభోత్సవంలా లేదు… మోదీ రాజకీయ వేడుకలా ఉంది: రాహుల్ గాంధీ

Ram Narayana

జైలు నుంచి ఫైళ్లపై సంతకాలు చేసే రోజులు పోయాయి: ప్రధాని మోదీ

Ram Narayana

మహారాష్ట్రలో ఓటమికి తోడు కాంగ్రెస్ కూటమికి మరో ఘోర పరాభవం!

Ram Narayana