అంతర్జాతీయం

ఇస్లామాబాద్‌లో ఎమర్జెన్సీ… 69కి చేరిన ఆత్మాహుతి దాడి మృతుల సంఖ్య!

  • మృతుల సంఖ్య 69కి చేరగా, 169 మందికి గాయాలు
  • నగరంలో ఎమర్జెన్సీని ప్రకటించినట్లు పోలీసు అధికారి వెల్లడి
  • గాయపడిన వారిని ఆసుపత్రికి తరలింపు

ఆత్మాహుతి దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌ ప్రభుత్వం ఇస్లామాబాద్‌లో ఎమర్జెన్సీ విధించింది. ఇస్లామాబాద్‌లోని షియా మసీదును లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో మృతుల సంఖ్య 69కి చేరగా, 169 మంది గాయపడ్డారు. నగరంలోని షెహ్జాద్ టౌన్ ప్రాంతంలో గల షియా మసీదు ప్రధాన ద్వారం వద్ద పేలుడు సంభవించింది. ఈ పేలుడు వల్ల సమీపంలోని భవనాలు, కిటికీలు కూడా పగిలిపోయాయి.

పేలుడు అనంతరం నగరంలో నగరవ్యాప్తంగా ఎమర్జెన్సీని ప్రకటించినట్లు ఇస్లామాబాద్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వెల్లడించారు. ముఖ్యమైన ప్రదేశాల్లో భద్రతా సిబ్బంది విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారిని పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సెస్, పాలీక్లినిక్ ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఇస్లామాబాద్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఖండించారు. ఈ ఘటన అత్యంత బాధాకరమని, పలువురు మృతి చెందారని అన్నారు. ఆత్మాహుతి దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.

Related posts

జోర్డాన్‌ చేరుకున్న మోదీ… 37 ఏళ్ల తర్వాత ఓ భారత ప్రధాని చరిత్రాత్మక పర్యటన!

Ram Narayana

మొస్సాద్‌కు ఏజెంట్‌గా పనిచేస్తున్నాడని ఆరోపణ .. ఇస్మాయిల్ ఫెక్రీ అనే వ్యక్తిని ఉరి తీసిన ఇరాన్

Ram Narayana

భారత సంతతి నేతకు డొనాల్డ్ ట్రంప్ క్షమాభిక్ష…

Ram Narayana