అంతర్జాతీయం

ఎప్ స్టీన్ ఫైల్స్ పై దలైలామా వివరణ!

  • ఇటీవల విడుదలైన ఫైల్స్ లో 169 చోట్ల దలైలామా ప్రస్తావన
  • జెఫ్రీ ఎప్ స్టీన్ ను తాను ఎన్నడూ కలవలేదన్న దలైలామా
  • ఎక్స్ వేదికగా ప్రెస్ నోట్ విడుదల చేసిన బౌద్ధ మతగురువు

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్ స్టీన్ ఫైల్స్ లో బౌద్ధ మతగురువు దలైలామా పేరు పలుమార్లు ప్రస్తావనకు రావడం తెలిసిందే. అమెరికా న్యాయ శాఖ ఇటీవల విడుదల చేసిన ఫైల్స్ లో ఏకంగా 169 చోట్ల దలైలామా పేరు కనిపించింది. ఈ విషయంపై నెలకొన్న అనుమానాలకు దలైలామా తాజాగా వివరణ ఇచ్చారు. ఎక్స్ వేదికగా మీడియా ప్రకటన విడుదల చేశారు. మహిళలు, మైనర్లపై లైంగిక నేరాలకు పాల్పడ్డ నిందితుడు జెఫ్రీ ఎప్ స్టీన్ ను తాను ఎన్నడూ కలవలేదని స్పష్టం చేశారు.

ఎప్ స్టీన్ ఫైల్స్ లో తన పేరు ప్రస్తావన, తనపై వస్తున్న ఆరోపణలు అన్నీ నిరాధారమైనవని కొట్టిపారేశారు. ఎప్ స్టీన్ తో కానీ ఆయన ప్రతినిధులతో కానీ తాను ఎన్నడూ ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదని స్పష్టం చేశారు. ఇటీవల కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలు, సోషల్ మీడియా పోస్టుల్లో జెఫ్రీ ఎఫ్ స్టీన్ తో దలైలామా సమావేశమైనట్లు చూపించడంపై దలైలామా ఆఫీసు అభ్యంతరం వ్యక్తం చేసింది. దలైలామాపై అసత్య ప్రచారం జరుగుతోందని ఆరోపించింది.

Related posts

అత్తారింటి నుంచి అయోధ్య రామయ్యకు వెండివిల్లు సహా 3 వేలకుపైగా కానుకలు

Ram Narayana

జస్ట్ మిస్ అంతే… లెబనాన్‌లో కవరేజీ ఇస్తుండగా జర్నలిస్టుల పక్కనే క్షిపణి దాడి!

Ram Narayana

ఎన్నికలు ప్రకటించగానే బంగ్లాదేశ్‌కు షేక్ హసీనా!.. ఆమె కొడుకు ఆసక్తికర వ్యాఖ్యలు

Ram Narayana