తెలంగాణ వార్తలు

మేడారం హుండీల లెక్కింపు… ఐదు రోజుల్లో రూ.11.83 కోట్ల ఆదాయం…

  • ఐదు రోజుల్లో 788 హుండీల లెక్కింపు
  • ఈరోజు 163 హుండీలను లెక్కించగా 1.12 కోట్ల ఆదాయం
  • మిగిలిన హుండీల లెక్కింపునకు మరో రెండు రోజులు పట్టే అవకాశం

మేడారం సమ్మక్క సారక్క జాతరకు సంబంధించిన హుండీల లెక్కింపు కొనసాగుతోంది. నేటితో హుండీల లెక్కింపు ఐదో రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు 788 హుండీలను లెక్కించగా రూ.11.83 కోట్ల ఆదాయం వచ్చింది. ఈరోజు 163 హుండీలను లెక్కించగా రూ.1.12 కోట్ల ఆదాయం సమకూరింది. మిగిలిన హుండీల లెక్కింపునకు సుమారు రెండు రోజులు పట్టవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు.

మంత్రి కొండా సురేఖ గత గురువారం కొబ్బరికాయ కొట్టి హుండీల లెక్కింపును ప్రారంభించారు. క్రితంసారి మేడారం జాతర ద్వారా రూ.13 కోట్ల ఆదాయం సమకూరింది. హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో లెక్కిస్తున్నారు. హుండీల లెక్కింపు పూర్తయ్యాక బంగారం, వెండి వస్తువుల విలువను నిర్ధారిస్తారు.

Related posts

ఐఏఎస్ అరవింద్ కు కార్ రేసు నిధుల విడుదల ఉచ్చు ….!

Ram Narayana

వారు పడుతున్న ఇబ్బందిని రేవంత్ రెడ్డి, నేను గమనిస్తున్నాం: భట్టి విక్రమార్క

Ram Narayana

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: ఓటర్ కార్డుల పంపిణీ.. కాంగ్రెస్ నేతపై క్రిమినల్ కేసు

Ram Narayana