తెలంగాణ వార్తలు

బాల్క సుమన్‌కు 14 రోజుల రిమాండ్…

  • బాల్క సుమన్‌కు రిమాండ్
  • 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన మంచిర్యాల కోర్టు 
  • సుమన్‌తో పాటు మరో ముగ్గురిని కూడా జైలుకు తరలింపు
  • క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటన

మంచిర్యాల జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన ఘటనలకు సంబంధించి బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు మంచిర్యాల మేజిస్ట్రేట్ కోర్టు  14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఆయనతో పాటు మరో ముగ్గురికి కూడా కోర్టు రిమాండ్ ఆదేశాలు జారీ చేసింది. మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్‌పై దాడి, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో మంగళవారం రాత్రి ఆయనపై కేసు నమోదైంది. దాంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపర్చారు.

వివరాల్లోకి వెళితే, మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల సందర్భంగా మంగళవారం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఎక్స్ అఫీషియో సభ్యునిగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ కాన్వాయ్‌ను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో మంత్రి కాన్వాయ్‌పై రాళ్లదాడి జరిగింది. ఈ ఘటనలో మంత్రి ప్రయాణిస్తున్న కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.

ఈ దాడికి బాల్క సుమన్ నాయకత్వం వహించారని, పోలీసుల బారికేడ్లను స్వయంగా ఆయనే మంత్రి కాన్వాయ్‌పైకి విసిరారని ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై మంత్రి వివేక్ తీవ్రంగా స్పందించారు. బాల్క సుమన్ గూండాలతో తనపై హత్యాయత్నం చేయించారని ఆరోపిస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, దాడికి పాల్పడ్డారని శ్రీరాంపుర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ ఫిర్యాదు మేరకు బాల్క సుమన్‌తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు ఆధారంగానే ఆయన్ను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ ఘటనతో మంచిర్యాల జిల్లాలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. గొడవల కారణంగా క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికను అధికారులు వాయిదా వేశారు.

Related posts

హైడ్రాపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు… సీఎస్ సహా పలువురికి నోటీసులు!

Ram Narayana

సమస్యలపై కేంద్రాన్ని నిలదీస్తాం…బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత నామ నాగేశ్వరరావు!

Drukpadam

సీఎం కేసీఆర్ గారు జర్నలిస్టుల గోడు వినండి …! టీయూడబ్ల్యూజే (ఐజేయూ ) రాష్ట్ర ఉపాధ్యక్షులు రాంనారాయణ…

Ram Narayana