- ఉద్యోగాలపై ఏఐ, నైపుణ్యాభివృద్ధి, కొత్త అవకాశాలపై చర్చ
- ప్రభుత్వపరంగా ఏం చేయాలనే అంశాలపై వారి మధ్య చర్చ
- రాష్ట్రాన్ని తయారీ కేంద్రంగా నిలబెట్టడానికి చర్యలు తీసుకోవాల్సి ఉందన్న సీఎం
అడోబ్ సీఈవో, తెలంగాణ రైజింగ్-2047 విజన్ బోర్డు సభ్యుడు శంతను నారాయణ్ హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఉద్యోగాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావం, నైపుణ్యాభివృద్ధి, తెలంగాణను తయారీ కేంద్రంగా మార్చడం, గ్లోబల్ ట్రెండ్స్, గ్రీన్ ఎనర్జీ, కొత్త అవకాశాలు వంటి అంశాలపై వారు చర్చించారు.
ప్రభుత్వపరంగా ఏం చేయాలనే అంశాలపై కూడా వారి మధ్య చర్చ జరిగింది. కృత్రిమ మేధను సమర్థవంతంగా వినియోగించుకునే అంశంపై శంతను నారాయణ్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. తెలంగాణను తయారీ కేంద్రంగా నిలబెట్టడానికి కీలక కంపెనీలను ఆకర్షించడానికి కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.