హైద్రాబాద్ వార్తలు

గచ్చిబౌలిలో కానిస్టేబుల్‌ను కారు బాయ్ నెట్ పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్..!

  • నానక్ రామ్ గూడా వద్ద మరో కారును ఢీ కొట్టిన డ్రైవర్
  • కారును ఆపకుండా పరారయ్యేందుకు ప్రయత్నం
  • ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద కారును ఆపేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఒక యువకుడు బెంజ్ కారుతో రోడ్లపై భయాందోళనలు సృష్టించాడు. తొలుత నానక్‌రాంగూడ వద్ద ఒక కారును ఢీకొట్టి పారిపోతుండగా, ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద ట్రాఫిక్ కానిస్టేబుల్ నర్సింహులు అతడిని ఆపేందుకు ప్రయత్నించాడు. అయితే, ఆ యువకుడు కారు ఆపకుండా కానిస్టేబుల్‌ను ఢీకొట్టడంతో ఆయన కారు బానెట్‌పై పడిపోయారు.

ఓపక్క బానెట్‌పై కానిస్టేబుల్ వేలాడుతున్నా, నిందితుడు అలాగే కారును దాదాపు 800 మీటర్ల వరకు అతివేగంగా తీసుకెళ్లాడు. ఈ దృశ్యాన్ని చూసిన తోటి వాహనదారులు కారును అడ్డుకోవడంతో కానిస్టేబుల్ ప్రాణాలతో బయటపడ్డారు. నిందితుడిని నార్సింగికి చెందిన తరుణ్ (24)గా గుర్తించారు. బ్రీత్ అనలైజర్ పరీక్షలో అతడు 160 ఎంజీ వరకు మద్యం సేవించినట్లు తేలింది. నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు.. కారును స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు.

Related posts

మణికొండలో హైడ్రా కూల్చివేతలు …

Ram Narayana

అయ్యో హైదరాబాద్… ఫుడ్ సర్వేలో అట్టడుగు స్థానం…

Ram Narayana

హైదరాబాద్ లో ఐటీ దాడులు…

Ram Narayana