హైద్రాబాద్ వార్తలు

శంషాబాద్ ఓఆర్ఆర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి

  • ఓఆర్ఆర్ ఎగ్జిట్ 16 వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు
  • లారీని ఢీకొట్టి నుజ్జునుజ్జయిన కారు
  • మృతుల్లో మహిళలు, చిన్నారులు
  • మరొకరి పరిస్థితి విషమం.. ఆసుపత్రికి తరలింపు

హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్ వద్ద టర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై వేగంగా వచ్చిన ఓ కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. టీఎస్ 23ఎఫ్ 2298 నెంబర్ కలిగిన మారుతి సుజుకీ వాగనార్ కారు పెద్దగోల్కొండ నుంచి శంషాబాద్ వెళుతోంది. 

వేగంగా దూసుకొచ్చిన కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టి నుజ్జునుజ్జయింది. దీంతో లారీకి వెనుక భాగంలో ఇరుక్కుపోయింది. ప్రమాదం జరిగినప్పుడు కారులో ఏడుగురు ఉన్నారు. ఘటనాస్థలంలోనే ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కొన ఊపిరితో ఉన్న మహిళను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Related posts

హైద‌రాబాద్‌లో గ‌లీజ్ దందా.. చికెన్ ప్రియుల‌కు షాకింగ్ న్యూస్‌!

Ram Narayana

హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో కొత్త ట్రెండ్.. మొత్తం విలువలో సగం ఖరీదైన ఇళ్లదే!

Ram Narayana

హైదరాబాద్‌లో హారన్ మోతకు చెక్.. ముంబై ఫార్ములాతో కొత్త రూల్?

Ram Narayana