అర్హులైన జర్నలిస్టులకు కార్డుల మంజూరు – స్టేట్ అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో నిర్ణయం …
చైర్మన్ కె .శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన కమిటీ సమావేశం
హాజరైన సమాచార పౌరసంబంధాల కమిషనర్ ప్రియాంక
తిరిగి ఏప్రిల్ లో సమావేశం అవ్వాలని నిర్ణయం..
రాష్ట్ర స్థాయిలో అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు మంజూరి చేస్తూ రాష్ట్ర స్థాయి అక్రిడిటేషన్ కమిటీ సమావేశం నిర్ణయం తీసుకున్నది ..హైదరాబాద్ లోని ఎఫ్ డీసీ బోర్డు లో మంగళవారం రాష్ట్ర మీడియా అక్రిడిటేషన్ కమిటీ (ఎస్ఎంఏసీ – స్టేట్ మీడియా అక్రిడిటేషన్ కమిటీ) సమావేశం జరిగింది. ప్రెస్ అకాడమీ, ఎస్ఎంఏసీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, సమాచార-పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్, ఎస్ఎంఏసీ కో-చైర్పర్సన్ సీహెచ్ ప్రియాంకతో కలిసి అక్రిడిటేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. అక్రిడిటేషన్ కోసం జర్నలిస్టులు సమర్పించిన దరఖాస్తులను కమిటీ సభ్యులు సమగ్రంగా పరిశీలించారు.జర్నలిస్టుల నుంచి అందిన ప్రతి దరఖాస్తును కమిటీ సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులను మంజూరు చేశారు. ఏప్రిల్ మొదటివారంలో తిరిగి సమావేశం కావాలని సమావేశం నిర్ణయించింది .