తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించండి …శాసనసభలో సిపిఐ నేత కూనంనేని

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని శాసనసభలో సిపిఐ పక్ష నేత కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని కోరారు .ప్రస్నోత్తరాల సమయంలో కూనంనేని జర్నలిస్టుల సమస్యలను సభ దృష్టికి ప్రత్యేకంగా తీసుకొచ్చారు .రాష్ట్రంలో జర్నలిస్టుల జీవితాలు దుర్భరంగా ఉన్నాయని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు ..అసలు రాష్ట్రంలో ప్రింట్ అండ్ ఎలెక్ట్రినిక్ మీడియాలో ఎంతమంది జర్నలిస్టులు ఉన్నారు .వారి జీవన పరిస్థితులు ఏమిటి ..? కనీస వేతనాలు అమలు జరుగుతున్నాయా ..?లేదా అని ప్రశ్నించారు ..వృత్తి భద్రత లేదు అందుకు అవసరమైన ప్రత్యేక చట్టం తేవాలని ప్రభుత్వాన్ని కోరారు ..

జర్నలిస్టుల హెల్త్ కార్డులు, రిటైరైన జర్నలిస్టులు కు పింఛన్లు ఇవ్వాలని అన్నారు . సబ్సిడీతో జర్నలిస్టులకు కెమెరా లను ,లాప్ టాప్ లను మొబైల్ ఫోన్లను ప్రభుత్వం ఇవ్వాలని అన్నారు . జహార్ లాల్ నెహ్రు హోసింగ్ సొసైటీకి సంబందించిన స్థలాల విషయాన్నీ పరిష్కరించాలని వారు తనను కలసి వారి సమస్యలు చెప్పారని ఇళ్లస్థలాల సమస్య పరిస్కారం కోసం అందుకు ప్రభుత్వం చొరవ చూపాలని అన్నారు . వేతనాలు లేక , ప్రభుత్వం ఆదుకోక వారు అన్యాయానికి గురవుతున్నారని కూనంనేని తెలిపారు . ఎం ప్యానల్ లో ఉన్న చిన్న పత్రికలకు యాడ్స్ ఇచ్చి ఆదుకోవాలని కోరారు .. ఇంకా చాల సమస్యలు ఉన్న తాను ప్రసవించిన విషయాలను ప్రభుత్వం సానుభూతితో పరిశీలించి పరిష్కరించాలని కోరారు ..సభలో సంబంధిత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లేనందున మంత్రి సీతక్క కూనంనేని చెప్పిన విషయాలని నోట్ చేసుకున్నానని సంబంధిత మంత్రికి తెలియజేస్తామని పేర్కొన్నారు ..

Related posts

బీసీలకు సీట్లు, ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన!

Ram Narayana

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు…అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి

Ram Narayana

అసెంబ్లీలో రాజగోపాల్ రెడ్డి, హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం

Ram Narayana