అంతర్జాతీయం

మదురో నిర్బంధం ముందే తెలిసి, పందెం కాసిన అమెరికా సైనికుడి అరెస్ట్…

  • రహస్య సమాచారాన్ని స్వలాభం కోసం వినియోగించినట్లు అభియోగాలు
  • క్రిప్టో ఆధారిత పాలి మార్కెట్‌లో మదురో నిర్బంధంపై పందెం కాసిన సైనికుడు
  • పందెంలో రూ.3 కోట్లకు పైగా గెలుచుకున్న సైనికుడు

వెనెజువెలా నేత నికోలస్ మదురోను నిర్బంధించిన అమెరికా ప్రత్యేక దళాల్లోని ఒక సైనికుడు అరెస్టయ్యాడు. ఈ సైనికుడు మదురో నిర్బంధంపై పందెం వేసి రూ.2 కోట్లు గెలుచుకున్నాడు. అయితే ఈ విషయం అతడికి ముందే తెలిసి ఆ రహస్య సమాచారాన్ని అతడు తన స్వలాభం కోసం వినియోగించాడు. తాజాగా ఈ విషయం బయటపడటంతో అమెరికా పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

ఈ ఏడాది జనవరిలో వెనెజువెలాపై అమెరికా సైన్యం మెరుపుదాడి చేసి, ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదురోను నిర్బంధించిన విషయం తెలిసిందే. ఆపరేషన్ అబ్జల్యూట్ రిజాల్వ్ పేరుతో ఈ దాడుల్లో గ్యానన్ కెన్ వాన్ డైక్ అనే సైనికుడు కూడా పాల్గొన్నాడు. ఈ ఆపరేషన్ గురించి ముందే తెలియడంతో, ప్రిడిక్షన్ మార్కెట్‌లో బెట్టింగ్‌లకు పాల్పడ్డాడు. మదురో నిర్బంధం సమాచారం బహిరంగంగా అందరికీ తెలియకముందు అతడు పందెం కాశాడు.

క్రిప్టో ఆధారిత ప్లాట్‌ఫామ్ పాలిమార్కెట్‌లో అతడు మదురో నిర్బంధంపై పందెం కాశాడని అమెరికా న్యాయశాఖ అతడిపై అభియోగాలు మోపింది. ఇది ఇన్‌సైడర్ ట్రేడింగ్, ఫెడరల్ చట్టానికి విరుద్ధమని న్యాయశాఖ పేర్కొంది. మదురో నిర్బంధంపై అతడు పందెం కాసి 4 లక్షల డాలర్లు గెలుచుకున్నాడు. ఇది భారత కరెన్సీలో దాదాపు రూ.3 కోట్లకు పైగా ఉంటుంది.

Related posts

థాయిలాండ్ ప్రధాని షినవత్రను సస్పెండ్ చేసిన కోర్టు

Ram Narayana

ప్రపంచం మరో యుద్ధాన్ని భరించలేదు: ఐరాస చీఫ్ గుటెర్రస్

Ram Narayana

కెన‌డాలో ఖలిస్థానీ గ్రూప్ దుశ్చ‌ర్య‌..ఆలయంలో హిందూ భక్తులపై దాడి.. ఖండించిన ప్ర‌ధాని ట్రూడో!

Ram Narayana