జనరల్ వార్తలు ...

తమిళనాడులో తండ్రి ఓటమి కుమారుడి గెలుపు

మూడో స్థానానికి పరిమితమైన మాజీ గవర్నర్ తమిళిసై

  • టీవీకే పార్టీ అభ్యర్థి సెల్వంపై గెలుపొందిన ఉదయనిధి స్టాలిన్
  • 7,140 పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం
  • మైలాపూర్‌లో గెలుపొందిన విజయ్ పార్టీ అభ్యర్థి
  • తమిళనాడులో తండ్రి ఓటమి కుమారుడి గెలుపు

తమిళనాడు లో అధికార డిఎంకె పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూసింది అంతే కాకుండా ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్ ఘోరంగా ఓటమి చెందారు కాగా డిప్యూటీ సీఎం అయిన తన కుమారుడు ఉదయనిది స్టాలిన్ చేపాక్ నుండి అతి తక్కువ మెజార్టీతో గెలుపొందారు . తమిళనాడు రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన టీవీకే పార్టీ అధినేత సినీ నటుడు విజయన్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసుకున్నారు. 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో టీవీ కె పార్టీ 107 స్థానం గెలుపొంది అతిపెద్ద పార్టీగా నిలిచింది మ్యాజిక్ ఫిగర్ 118 కాగా మరో 11 స్థానాలు వస్తే సంపూర్ణ మెజార్టీ వచ్చినట్టు అవుతుంది . చిన్నాచిత పార్టీలు కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీవీకే రంగంలోకి దిగింది . ముఖ్యమంత్రిగా విజయన్ అధికారం చేపట్టే దిశగా అడుగులు వేస్తున్న విజయం తండ్రి ఇప్పటికే కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలకు బహిరంగంగానే బంపర్ ఆఫర్ ఇచ్చారు.

చెపాక్ తిరువెళ్లికేని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి డీఎంకే పార్టీ యువనాయకుడు, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ విజయం సాధించారు. సమీప తమిళిగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అభ్యర్థి సెల్వంపై 7,140 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన సెల్వం, అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీలో చేరారు. ఉదయనిధి స్టాలిన్‌కు 62,992 ఓట్లు రాగా, సెల్వంకు 55,852 ఓట్లు వచ్చాయి. అన్నాడీఎంకే పార్టీ అభ్యర్థికి 16 వేల పైచిలుకు ఓట్లు మాత్రమే వచ్చాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి స్టాలిన్ ఓటమి చెందారు. ఆయన తనయుడు ఉదయనిధి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో డీఎంకే పార్టీ శాసనసభా పక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్ వ్యవహరించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మరోవైపు, మైలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ మాజీ అధ్యక్షురాలు, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఓడిపోయారు. ఈ నియోజకవర్గం నుంచి టీవీకే పార్టీ అభ్యర్థి వెంకటరామనన్ సమీప డీఎంకే అభ్యర్థిపై 28 వేల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు. తమిళిసై మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఆమెకు 32,328 ఓట్లు మాత్రమే వచ్చాయి.

Related posts

జర్నలిస్టుల హక్కుల రక్షణ ,పై దేశవ్యాపిత ఆందోళనలు …టియుడబ్ల్యుజె ఐజెయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె విరాహాత్ అలీ….!

Ram Narayana

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక సూపర్‌ఫాస్ట్ వేగంతో టికెట్ బుకింగ్!

Ram Narayana

భారత్ లో ‘ఎక్స్’ వినియోగదారులకు గుడ్ న్యూస్

Ram Narayana