జనరల్ వార్తలు ...

అమెరికాలో కాల్పుల కలకలం.. ఎనిమిది మంది బాలల మృతి…

Louisiana Shooting Eight Children Killed in Shreveport
  • అమెరికాలో మరోసారి కాల్పుల మోత
  • లూసియానాలో 8 మంది చిన్నారులు మృతి
  • పోలీసుల కాల్పుల్లో నిందితుడు హతం

అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. లూసియానా రాష్ట్రంలోని ష్రీవ్‌పోర్ట్‌‌లో జరిగిన ఈ దారుణంలో 8 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఘటన అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడిని పోలీసులు కాల్చి చంపారు.

స్థానిక పోలీసుల వివరాల ప్రకారం.. లూసియానా రాష్ట్రం ష్రీవ్‌పోర్ట్‌‌ ప్రాంతంలో ఓ సాయుధుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 1 నుంచి 14 ఏళ్లలోపు వయసున్న ఎనిమిది మంది చిన్నారులు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో కొందరు నిందితుడి బంధువులు కూడా ఉన్నారని పోలీసులు ప్రాథమికంగా తెలిపారు.

దాడుల తర్వాత నిందితుడు ఓ కారును అపహరించి పారిపోయాడు. పోలీసులు వెంబడించి పట్టుకునే ప్రయత్నం చేయగా, కాల్పులకు తెగబడ్డాడు. దీంతో తాము ఎదురుకాల్పులు జరపగా నిందితుడు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విస్తృత దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

2023కి వీడ్కోలు పలుకుతూ… తల్లికి ఇష్టమైన తియ్యని వంటకం చేసిన రాహుల్ గాంధీ… వీడియో ఇదిగో!

Ram Narayana

చెత్తకుప్పలో వృద్ధురాలు .. తానే పారేశానన్న మనవడు!

Ram Narayana

ఈయనకు రూ.100 కోట్ల ఆస్తి ఉందంటే ఎవరూ నమ్మరు!

Ram Narayana