వైఎస్ షర్మిల పార్టీ పెట్టబోతున్నారా?
-అన్న అండదండలు ఉన్నాయా ?
-తల్లి విజయమ్మ అశీసులు పొందారా ?
వైయస్ షర్మిల పార్టీ పెట్టబోతున్నారా ?నిజంగా కొత్త పార్టీకి తెలంగాణాలో ఆవకాశం ఉందా? షర్మిల నిర్ణయం వెనక అసలు ఉద్దేశం ఏమిటి ? అన్న జగన్ తో సఖ్యత లేదా? ఉండే తెలంగాణాలో పార్టీ పెడుతున్నారా? తల్లి విజయమ్మ అశీసులు పొందారా? ఉన్నట్లు ఉండి షర్మిల ఎందుకు సమావేశం ఏర్పాటు చేశారు. అనేదానిపై రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణకు చెందిన వైయస్ కు సన్నిహితుడుగా పేరున్న మాజీ ఎమ్మెల్యే గొనె ప్రకాశరావు కొన్నినెలల క్రితమే షర్మిల పార్టీ పెడతారని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అన్న చెల్లెలు మధ్య సఖ్యత లేదని ప్రచారం జరుగుంతుంది. అన్న అధికారంలోకి వచ్చిన తరువాత ఆమె విజయవాడ వెళ్ళలేదు. కుటుంబంతో జరుపుకునే ముఖ్యమైన కార్యక్రమాలకు సైతం పులివెందులకు జగన్ తో కలిసి షర్మిల పాల్గొన్న దాఖలాలు లేవని అంటున్నారు. షర్మిల పార్టీ పెడతారని ఒక ప్రముఖ దినపత్రికి కథనం రాస్తే స్వయంగ షర్మిలనే దాన్ని తీవ్రంగా ఖండించారు. అది జరిగి కొద్దిరోజులు కూడా కాలేదు. కానీ ప్రస్తుతం ఆమె పార్టీ పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రత్యేకించి నల్లగొండ జిల్లాకు చెందిన వైయస్ అభిమానులతో మంగళవారం సమావేశం కానున్నారని ఆసమావేశానికి 5 వేల మంది వరకు వస్తారని అంచనా . అన్నతో తగాదా ఉంటె ఏపీ లో పార్టీ పెట్టాలి కానీ తెలంగాణాలో ఎందుకు పెడుతున్నట్లు అనే సందేహాలు కలుగుతున్నాయి. నిజంగా పార్టీ పెడతారా ? పెడితే ఆమె ఎలాంటి ప్రకటన చేయనున్నారు. అనేదానిపై ఆశక్తి నెలకొన్నది . పార్టీ పెడితే పత్రిక కధనం పై ఎందుకు స్పందించారు అనే అనుమానాలకు తెరదించే ఆవకాశం ఉంది. అన్నకు ఆమెకు పడటంలేదని మరో ప్రచారం … అందువల్ల ఆమె తన దారి తాను చూసుకుంటుందనే అభిప్రాయాలూ కూడా వ్యక్తం అవుతున్నాయి. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తనదంటూ ముద్ర వేశారు. ఆయన హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయిన సంగతి విదితమే . అప్పట్లోనే ఉమ్మడి రాష్ట్ర సీఎం గా ఆయన కుమారుడైన జగన్ మోహన్ రెడ్డి ని ముఖ్యమంత్రిని చేయాలనీ శాసన సభ్యులందరు సంతకాలు చేసి అధిష్టానానికి ఇచ్చారు . అయినప్పటికీ అధిష్టానం ఆయన్ను కాకుండా సీనియర్ నేత రోశయ్య ను చేసింది. వైయస్ మరణంతో అనేక మంది గుండె ఆగిపోయి చనిపోయారు. వారిని కలిసి పరామర్శించేందుకు జగన్ ఓదార్పు యాత్ర చేపట్టారు. దాన్ని కాంగ్రెస్ అధిష్టానం వద్దని చెప్పింది. దీనితో వైయస్ కుటుంబం విభేదించింది .పార్టీకి దూరమైంది . ఆయన తన తల్లి విజయమ్మ లు తమకున్న ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేశారు. ఆయనపై కేసులు సిబిఐ దాడులు , జైలుకు పంపటం జరిగాయి . ఆయన ఓదార్పు యాత్ర నిలిచి పోవటంతో చెల్లి షర్మిల అన్న ఆదేశం మేరకు రంగంలోకి దిగారు. అన్న వదిలిన బాణాన్ని అన్నారు. ఓదార్పు యాత్ర కొనసాగించారు. 2014 2019 ఎన్నికలలో అన్నకు అండగా నిలిచారు . చివరకు ఆయన పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని చేపట్టింది. ఎన్నికలప్పుడు , అంతకుముందు , అవసరమైనప్పుడు తల్లి విజయమ్మ , చెల్లెలు షర్మిల ను ఉపయోగించుకొని తరవాత పట్టించుకోవటంలేదని అభిప్రాయాలూ ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే షర్మిల పార్టీకి దూరంగా ఉంటున్నారు. తల్లి కూడా అంటి ముట్టనట్లుగా వ్యవహరించటంతో వైయస్ కుటుంబంలో కలతలు ఉన్నాయని అన్న జగన్, చెల్లెలు షర్మిలకు పడటం లేదనే ప్రచారం ఊపందుకున్నది . జగన్ భార్య భారతి తో కూడా షర్మిలకు పొసగటం లేదని వార్తలు గుప్పుమంటున్నుయి. 2014 ,2019 ఎన్నికలలో షర్మిల పోటీచేస్తారని అనుకున్నారు. అది జరగలేదు. విశాఖ పార్లమెంట్ కు విజయమ్మ స్థానంలో షర్మిల పోటీచేస్తే ఫలితం వేరేలా ఉండదనే అభిప్రాయాలూ వ్యక్తం అయ్యాయి. తరువాత జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆయన కాబినెట్ లోకి షర్మిల ని తీసుకుంటే బాగుండేదని అభిప్రాయాలూ ఉన్నాయి. ఎందుకోగానీ జగన్ దూరంగా ఉంచుతున్నారన్న అనుమానాలు ఉన్నాయి. ఇది వారే స్వయంగా చెపితేకాని నిజాలు బయటకు రావు . ఆకుటుంబం మీద వస్తున్నా వార్తలు ఆయన అభిమానులను ఆవేదన కలిగిస్తున్నాయి. మరి ఏమిజరుగుతుందో చూద్దాం ???
previous post