Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఆఫ్ఘనిస్థాన్‌లోనే అహ్మద్ మసూద్.. పంజ్‌షీర్‌లో పోరు తీవ్రం!

ఆఫ్ఘనిస్థాన్‌లోనే అహ్మద్ మసూద్.. పంజ్‌షీర్‌లో పోరు తీవ్రం!
మసూద్ టర్కీ పారిపోయారన్న వార్తలను ఖండించిన ఇరాన్ వార్తా సంస్థ
సురక్షిత ప్రాంతంలో ఉంటూ లోయతో సంబంధాలు కొనసాగింపు
గత నాలుగు రోజులుగా భీకర యుద్ధం
ఇరు వైపులా భారీ ప్రాణ నష్టం

పంజ్ షేర్ ప్రాంతం తాలిబన్ల వశమైందిని చెపుతున్న ఇంకా అక్కడ తాలిబాన్లకు పంజ్ షేర్ యోధులకు మధ్య భీకర పోరు జరుగుతుంది. తాలిబన్ల పరిపాలన అంగీకరించేదిలేదని ఆఫ్ఘన్ నేషనల్ రెసిస్టన్స్ ఫోర్స్ ప్రకటించింది. తాలిబన్లు తాము పంజ్ షేర్ ప్రాంతాన్ని తనస్వాధీనంలోకి తెచుకున్నామని ప్రకటించింది. అందుకు గవర్నర్ కార్యాలయంపై తాలిబన్ల జెండా ఎగరవేశామని ఆదృశాలను ప్రపంచానికి చూపిస్తుంది. అక్కడ అహమ్మద్ మసూద్ నాయకత్వంలో తిరుగుబాటు తారాస్థాయికి చేరింది. రెండు వైపులా భారీ ప్రాణనష్టం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. తెలిబాన్లయి ఇప్పటికే 70 పైగా రోడ్లను ఆక్రమించుకున్నారని ఎం ఆర్ ఎఫ్ నేత ఒకరు అన్నారు.

పంజ్‌షీర్‌ ప్రావిన్స్ తాలిబన్ల చేతికి చిక్కకుండా పోరాడుతున్న ఆఫ్ఘన్ నేషనల్ రెసిస్టెన్స్ ఫోర్స్ (ఎన్ఆర్ఎఫ్) నేత అహ్మద్ మసూద్ ఇంకా అక్కడే ఉన్నారని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఫార్స్ న్యూస్ ఓ కథనంలో తెలిపింది. పంజ్‌షీర్ తాలిబన్ల వశమైందని, దీంతో అహ్మద్ మసూద్ టర్కీకి పారిపోయారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని, ఆయన అక్కడే సురక్షితమైన ప్రాంతంలో ఉంటూ పంజషీర్‌ లోయతో సంబంధాలు కొనసాగిస్తున్నారని ఆ కథనంలో పేర్కొంది. కాగా, పంజ్‌షీర్‌ను తాము స్వాధీనం చేసుకున్నట్టు చేసిన తాలిబన్ల ప్రకటనను ఎన్ఆర్ఎఫ్ దళాలు ఖండించాయి. మరోవైపు, అహ్మద్ మసూద్ సన్నిహితుడు ఖాసీం మహమ్మదీ మాట్లాడుతూ.. పంజ్‌షీర్‌లోని 70 శాతం రహదారులు తాలిబన్ల అధీనంలోనే ఉన్నాయని, అయితే, లోయలోని అత్యంత కీలక ప్రాంతాలు ఇంకా ఎన్ఆర్ఎప్ దళాల చేతల్లోనే ఉన్నాయని పేర్కొన్నారు. గత నాలుగు రోజులుగా ఇక్కడ ఇరు వర్గాల మధ్య భీకర పోరు జరుగుతోంది. ఇరు వైపుల భారీ సంఖ్యలో మరణాలు సంభవించినట్టు తెలుస్తోంది.

Related posts

తెలంగాణ కేబినెట్ కీల‌క నిర్ణ‌యాలు …..

Drukpadam

పుతిన్ కు మోదీ సూచన..స్పందించిన రష్యా..!

Drukpadam

ఆర్టీసీ చార్జీలు పెంచేందుకు తెలంగాణ సర్కార్ రంగం సిద్ధం…

Drukpadam

Leave a Comment