Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

మహిళల భద్రతకు రక్షణ కవచంగా షీ టీమ్స్ … పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్!

మహిళల భద్రతకు రక్షణ కవచంగా షీ టీమ్స్ … పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్!
-మహిళలకు మరింత భద్రతకు షీ టీమ్స్
-మహిళలపై ఆగడాలకు హద్దు మీరితే కఠిన చర్యలు
-పోకిరీల ఆట కట్టించాలి …
-షీ టీమ్‌ పోలీసులు మఫ్టీలో నిఘా వేసి ఉంచాలి

మహిళల భద్రతకు మరింత భరోసా కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఏడు షీ టీమ్ బృందాలతో ఈరోజు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ..మహిళలపై ఆగడాలకు హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. విద్యార్థినులపై వేధింపులు, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే పోకిరీలను అరెస్టు చేసి చట్ట ప్రకారం శిక్షించడం,ఈవ్‌టీజర్ల తల్లిదండ్రులను పిలిపించి వారి సమక్షంలో కౌన్సిలింగ్‌ ఇవ్వడం, మళ్లీ పట్టుబడితే తీవ్రమైన కేసును నమోదు చేయడం షీ టీమ్స్ ముఖ్య నిర్వహణ భాధ్యతలని అన్నారు.

నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద పబ్లిక్‌ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ, పార్కులు, బస్టాండ్, బస్‌ స్టాప్‌లు, కళాశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల చుట్టుపక్కల ప్రాంతాలను హాట్‌స్పాట్‌లుగా గుర్తించి షీ టీమ్‌ పోలీసులు మఫ్టీలో నిఘా వేసి ఉండాలని సూచించారు.

లైంగిక వేధింపులు, దాడులు, సైబర్‌ నేరాల నుంచి ‘ఆమె’ను రక్షించడానికి నిరంతరాయంగా కృషి చేస్తూ.. సమస్య వచ్చినప్పుడు సందేహించకుండా అండగా నిలవాలని సూచించారు

అధునిక సమాజంలో మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్న ప్రస్తుత తరుణంలో కొంతమంది క్షణికానందం కోసం సోషల్ మీడియా వేదికలపై మహిళలపై అనుచిత వాఖ్యలు చేయటమో, ఇతర మార్గాలలో వేధించడం.. తదనంతరం జరిగే పరిణామాలతో ఇబ్బందులు ఎదుర్కొవడం..
వంటి జీవితాన్ని స్వస్తి పలికేలా వివిధ వేదికల ద్వారా వారిలో మార్పు తీసుకొని రావలని సూచించారు. సమావేశంలో షీటీమ్ ఇంచార్జ్ సిఐ అంజలి, షీటీమ్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

డబ్బుకు ఆశపడి వరంగల్ లో కొడుకును అమ్ముకున్న తండ్రి?

Drukpadam

బొమ్మలా నిలబడి జువెలరీ షాపులో యువకుడు నగల చోరీ!

Ram Narayana

చిన్నారిని దత్తత పేరుతొ వ్యభిచారంలోకి దించిన మహిళ

Drukpadam

Leave a Comment