Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాబోయే రోజుల్లో రాయలసీమ రూపురేఖలే మారిపోతాయి: సీఎం జగన్

రాబోయే రోజుల్లో రాయలసీమ రూపురేఖలే మారిపోతాయి: సీఎం జగన్
-పెద్ద సంఖ్యలో కంపెనీ లు వస్తాయన్న జగన్ …
-అనేక కంపెనీ లు ఆశక్తి చూపుతున్నాయని వెల్లడి
-కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన
-కొప్పర్తిలో మెగా ఇండస్ట్రియల్ పార్కు ప్రారంభం
-75 వేల ఉద్యోగాలు వస్తాయని వెల్లడి
-పెద్ద సంఖ్యలో కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని వివరణ

ఏపీ సీఎం జగన్ మూడు రోజుల పర్యటనకు తన సొంత జిల్లా వైయస్సార్ కడప జిల్లాలో వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు . ఈ రోజు బద్వేల్ లో పాల్గొని మెగా ఇండస్ట్రియల్ పార్క్ ను ప్రారంభించారు .దీనితో పాటు కడప జిల్లాకు ఇంకా మరో 6 కంపెనీ లు రానున్నాయని ప్రజల హర్షద్వానాల మధ్య తెలిపారు . మరో 18 కంపెనీ లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని సీఎం పేర్కొన్నారు .

కడప జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. తాజాగా కొప్పర్తిలో మెగా ఇండస్ట్రియల్ పార్కును ప్రారంభించారు. వైఎస్సార్-జగనన్న ఇండస్ట్రియల్ హబ్, వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ ల ప్రారంభోత్సవం అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ, ఎలక్ట్రానిక్ హబ్ ద్వారా 75 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని, రాబోయే రోజుల్లో రాయలసీమ రూపురేఖలు మారిపోతాయని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.

3,164 ఎకరాల్లో విస్తరించిన మెగా ఇండస్ట్రియల్ పార్కు కోసం రూ.1,585 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఈ మెగా పార్కును ఏర్పాటు చేయడం సంతోషదాయకమని, ఇక్కడ శిక్షణ పొందిన ఉద్యోగులు ఇదే చోట పనిచేస్తారని వెల్లడించారు.

మెగా ఇండస్ట్రియల్ పార్కులో రూ.600 కోట్ల పెట్టుబడులతో 6 కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. పెట్టుబడులు పెట్టేందుకు మరో 18 కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. మరో 6 నుంచి 9 నెలల్లో మరిన్ని ఉద్యోగాలు వస్తాయని సీఎం జగన్ వివరించారు.

Related posts

బీఆర్ యస్ ఎన్నికల వ్యూహం …ఖమ్మం జిల్లా భాద్యతలు ట్రబుల్ షూటర్ హరీష్ రావు కు …

Drukpadam

అధికారం కోసం ఎప్పుడూ వెంపర్లాడలేదు…చంద్రబాబు

Drukpadam

మీడియా సమావేశంలో లాలూయాదవ్ సంచలన వ్యాఖ్యలు …

Drukpadam

Leave a Comment