ఆంధ్రప్రదేశ్

ఖమ్మం జైలుకు రాఘవ…రహస్యంగా తరలింపు

రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసు నిందితుడు వనమా రాఘవను ఖమ్మం జిల్లా జైలుకు అత్యంత రహస్యంగా తరలించారు. భద్రాచలం ప్రత్యేక సబ్‌ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రాఘవను. భద్రతా కారణాల రీత్యా కోర్టు ఆదేశాల మేరకు ఖమ్మం తరలించామని అధికారులు చెబుతున్నారు. అయితే రాఘవ తరలింపును గోప్యంగా ఉంచారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కాగా రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిగా వనమా రాఘవను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు రాఘవను రిమాండ్ విధించింది. అయితే వనమా అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వనమా రాఘవ తండ్రి వనమా వెంకటేశ్వరరావు కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఉన్నారు. తన తండ్రి అధికారం మాటున షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ అరాచకాలకు పాల్పడ్డారనికొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాల్లో రాఘవ బాధితులు గగ్గోలు పెడుతున్నారు. రామకృష్ణ కుటుంబం ఆయన వల్లనే చనిపోయిందని అందువల్ల ఆయనకు కఠిన శిక్షలిధించాలనే డిమాండ్ పెరుగుతుంది. తండ్రిని అడ్డం పెట్టుకుని చేసిన ఆరచకాలను గుర్తు చేస్తున్నారు. సెటిల్‌మెంట్ల పేరుతో వేధింపులకు పాల్పడుతున్నాడని బాధితులు ఆరోపించారు. తన మాట వినని వారిపై రాఘవ దాడులు చేయించడం, పోలీసు కేసులు పెట్టించడం వంటి చర్యలకు పాల్పడుతూ ఇబ్బందులకు గురిచేశారని చెప్పారు.

మూడు నెలల క్రితం పాల్వంచకు చెందిన మల్లిపెద్ది వెంకటేశ్వరరావు అనే వ్యక్తి.. తాను వనమా రాఘవ వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని లేఖ రాసిపెట్టి సూసైడ్‌ చేసుకున్నాడు. వెంకటేశ్వరరావు సూసైడ్‌ నోట్‌ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇందులో ప్రధాన నిందితుడుగా వనమా రాఘవను చేర్చారు. ఇక రామకృష్ణ అనే వ్యక్తి కూడా.. తాను, తన కుటుంబం రాఘవ వేధింపులతోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నామని లేఖ రాసిపెట్టి సూసైడ్‌ చేసుకున్నారు. ఈ కేసులోనూ రాఘవ ప్రధాన నిందితుడుగా ఉన్నారు. పాల్వంచ పోలీసులు 306 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. ఇలా వరుస ఘటనలు, కేసులు రాఘవ వేధింపులు, అరాచకాలకు అద్దం పడుతున్నాయని జోరుగా చర్చ జరుగుతోంది.

రాఘవను ఉరి తీయాలి మాజీ ఎమ్మెల్యే గుమ్మడి

వనమా పదవికి రాజీనామా చేయాలి

సీపీఐ ఎం ఎల్ న్యూడెమోక్రసీకి చెందిన మాజీ శాసన సభ్యులు గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ రాఘవను ఉరితీయాలని లేదా ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. వనమా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అన్నారు.

Related posts

ఏపీ సీఐడీకి షాక్…అయ్యన్న రిమాండ్ కు విశాఖ కోర్టు తిరస్కరణ!

Drukpadam

జనాభాలో చైనాను అధిగమించిన భారత్ …

Drukpadam

అయ్యన్న పాత్రుడిపై సీఐడీ దర్యాప్తుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Drukpadam