Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

ఒమిక్రాన్ కథ ముగిసినట్టే.. బ్రిటన్, అమెరికాలో పీక్ కు చేరిన కేసులు..

ఒమిక్రాన్ కథ ముగిసినట్టే.. బ్రిటన్, అమెరికాలో పీక్ కు చేరిన కేసులు..
-తదుపరి ఎలా ఉంటుందోనన్న అనిశ్చితి
-వారంలోనే అమెరికాలో పీక్ దశకు
-బ్రిటన్ లో ఇప్పటికే గరిష్ఠాలకు చేరాయి
-ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా తగ్గుముఖం
-నిపుణుల అంచనాలు

కరోనా ఒమిక్రాన్ విషయంలో ఊరటనిచ్చే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దాని కథ ముగిసినట్లేనని కొందరు అభిప్రాయపడుతున్నారు . దక్షణఫ్రికాలో ఉచ్చ స్థాయిలోకి చేరినతరువాత కేసులు తగ్గుముఖం పట్టిన విషయాన్నీ ఉదహరిస్తున్నారు. అందువల్ల కేసుల సంఖ్య పెరిగితగ్గుతుందనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు . బ్రిటన్ లో కూడా తగ్గుముఖం పట్టిన విషయాన్నీ ఉదహరిస్తున్నారు . ఒమిక్రాన్ రకం తొలుత దక్షిణాఫ్రికాలో వెలుగు చూసి, తర్వాత ప్రపంచ దేశాలకు విస్తరించింది. అమెరికా, బ్రిటన్ లో కేసులు భారీగా పెరిగిపోవడం చూస్తున్నాం. అలాగే భారత్ లోనూ 2 లక్షల మేర రోజువారీ కొత్త కేసులు వస్తున్నాయి.

అయితే ఇది ఎంత వేగంగా విస్తరించిందో, అంతే వేగంగా తగ్గుముఖం పడుతున్నట్టు దక్షిణాఫ్రికా అనుభవాలు చెబుతున్నాయి. ఇప్పుడు బ్రిటన్, అమెరికాలోనూ కేసులు గరిష్ఠాలకు (పీక్) చేరాయి. బ్రిటన్ లో ఇప్పటికే పీక్ కు చేరాయని, అమెరికాలోనూ ఇంచుమించు అదే స్థాయికి వచ్చేసినట్టు నిపుణులు చెబుతున్నారు. ఎంత వేగంగా పాకిపోయిందో.. అంతే వేగంగా ఇది తగ్గుముఖం పట్టనుందని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ లో హెల్త్ మెట్రిక్స్ సైన్స్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న అలీమక్దాద్ అంటున్నారు.

ఇంకా చాలా మంది ఇన్ఫెక్షన్ బారిన పడాల్సి ఉందని, కేసులు ఒక వారంలో పీక్ కు చేరొచ్చని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ డైరెక్టర్ లారన్ ఆన్సెల్ మేయర్స్ పేర్కొన్నారు. జనవరి 19 నాటికి అమెరికాలో రోజువారీ కొత్త కేసులు 12 లక్షలకు చేరుకుని, వేగంగా తగ్గిపోతాయని అలీమక్దాద్ అంచనా వేశారు. బ్రిటన్ లో రోజువారీ 2 లక్షల కొత్త కేసులు రాగా, గత వారం వీటి సంఖ్య 1,40,000 వేలకు పడిపోవడం గమనార్హం. మరోవైపు తదుపరి కరోనా రకం ఎలా ఉంటుందోనన్న ఆందోళన అయితే ప్రపంచ వ్యాప్తంగా వైద్య నిపుణులు, ప్రభుత్వాధినేతల మనసుల్లో నెలకొంది.

Related posts

ఒమిక్రాన్ దెబ్బకు 11,500 విమానాల రద్దు!

Drukpadam

ఉదయం 10 తర్వాత బయట వస్తే వాహనం జప్తు: డీజీపీ మహేందర్‌రెడ్డి హెచ్చరిక…

Drukpadam

ఎన్నికలపై పెట్టిన దృష్టి కరోనా కట్టడిపై ఒక్క శాతం పెట్టినా బాగుండేది!:సంగీత దర్శకుడు ఆర్‌.పి.పట్నాయక్‌

Drukpadam

Leave a Comment