Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

సీడీఎస్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదానికి కారణాన్ని వెల్లడించిన కేంద్రం!

సీడీఎస్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదానికి కారణాన్ని వెల్లడించిన కేంద్రం

  • గత నెల 8న హెలికాప్టర్ ప్రమాదం
  • నీలగిరి కొండల్లో కూలిన హెలికాప్టర్
  • రావత్ సహా 14 మంది దుర్మరణం
  • విచారణ జరిపిన త్రివిధ దళాల కోర్టు

భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ గత డిసెంబరు 8న తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం తెలిసిందే. ఆయనతో పాటు మరో 13 మంది కూడా ఈ ప్రమాదంలో కన్నుమూశారు. కాగా ఈ ఘటనపై త్రివిధ దళాల కోర్టు విచారణ నివేదిక వెల్లడైంది.

ప్రమాదంలో యాంత్రిక వైఫల్యం లేదని, హెలికాప్టర్ లో సాంకేతిక లోపాలు లేవని, సిబ్బంది నిర్లక్ష్యం కూడా లేదని తేలిందని భారత రక్షణశాఖ తెలిపింది. ఊహించని వాతావరణ పరిస్థితుల వల్లే ప్రమాదం సంభవించిందని స్పష్టం చేసింది. ఒక్కసారిగా భిన్న వాతావరణం ఎదురయ్యేసరికి పైలెట్లు అయోమయానికి గురయ్యారని, హెలికాప్టర్ ను మబ్బుల్లోకి తీసుకెళ్లారని, ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిందని వివరించింది. ఫ్లయిట్ డేటా రికార్డర్, కాక్ పిట్ వాయిస్ రికార్డర్ లను విశ్లేషించాకే నివేదిక రూపొందించినట్టు తెలిపింది.

Related posts

కర్ణాటక అసెంబ్లీలో ‘హనీ ట్రాప్’ రగడ… విచారణకు సిద్ధమైన ప్రభుత్వం!

Ram Narayana

భారత హాకీ జట్టుకు అభినందనలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ!

Ram Narayana

బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో మమతా పార్టీ జోరు, రెండో స్థానంలో బీజేపీ!

Drukpadam

Leave a Comment