Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ప్రధాని నోటా మరోసారి జమిలి మాట …

ప్రధాని నోటా మరోసారి జమిలి మాట …
పదేపదే ఎన్నికలు జరిగితే అభివృద్ధి కుంటుపడుతుంది
ఎన్నికలన్నీ ఒకేసారి జరిగితేనే అభివృద్ధి
దేశంలో ఓటింగ్ 75 శాతం దాటడం లేదు
సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు కానీ ఓటేయడం లేదు
ఓటరుకార్డుతో ఆధార్‌ను అనుసంధానిస్తే పారదర్శకత

దేశంలో పదేపదే ఎన్నికలు జరగడం వల్ల ఆ ప్రభావం దేశాభివృద్ధిపై పడుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని గుజరాత్‌లోని బీజేపీ పన్నా ప్రముఖ్ (పేజీ కార్యకర్త)లను ఉద్దేశించి ప్రధాని నిన్న నమో యాప్ ద్వారా వర్చువల్‌గా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

జమిలి ఎన్నికల స్ఫూర్తితో ‘ఒకే దేశం-ఒకే ఓటరు జాబితా’ను రూపొందించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఆధార్ కార్డుతో ఓటరు కార్డును అనుసంధానించడం వల్ల ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందన్నారు.

75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న మన దేశంలో ఓటింగ్ శాతం కూడా 75 శాతం దాటాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా బీజేపీ కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే పట్టణ ప్రాంత ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఆసక్తి చూపించడం లేదని ప్రధాని అన్నారు.

ఈ విషయంలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. దేశానికి జమిలి ఎన్నికలు ఆవశ్యకమని పేర్కొన్న ప్రధాని.. లోక్‌సభ ఎన్నికలైనా, అసెంబ్లీ ఎన్నికలైనా, పంచాయతీ, ఇతర స్థానిక సంస్థల ఎన్నికలైనా ఒకేసారి నిర్వహించడం వల్ల మాత్రమే అభివృద్ధి జరుగుతుందని ఉద్ఘాటించారు.గతంలోనూ ప్రధాని గుజరాత్ లో ఇదే వైఖరిని వెల్లడించారు. ఎన్నికల సంఘం కూడా ఒకే సారి ఎన్నికలు జరిపే అంశంపై పరిశీలన జరిపింది.పార్లమెంట్ , అన్ని రాష్ట్రాల అసెంబ్లీ లకు , పంచాయతీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలని అభిప్రాయపడ్డారు .అప్పుడు మాత్రమే అభివృద్ధి సాధ్యమౌతుందని ప్రధాని మోడీ ఉద్ఘాటించారు.

Related posts

కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఎన్నిక లాంఛనమే!

Drukpadam

పొంగులేటి అనుచరుల శవాలు కూడా మిగలవు: ఖమ్మంలో కలకలం రేపుతున్న పోస్టర్లు

Drukpadam

మునుగోడులో తెలంగాణ జనసమితి పోటీ ….?అభ్యర్థి పల్లె వినయ్ కుమార్ గౌడ్ …?

Drukpadam

Leave a Comment