Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మేడారంకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు…

 

మేడారంకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు
రవాణా సౌకర్యాలపై మంత్రి అజయ్ సమీక్ష

మేడారం జాతరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సు లను నడుపుతున్నట్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. మేడారం జాత‌ర నిర్వ‌హ‌ణ‌కు రవాణా సౌకర్యాలపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఖైరతాబాద్ రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో రవాణా మరియు ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంత్రి భేటీ అయ్యారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ గిరిజన కుంభమేళాకు రాష్ట్రము నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరు కానున్నారు.అందువల్ల జాతరకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నందున అందుకు తగ్గట్లుగా వివిధ డిపో లనుంచి బస్సు లను నడిపేందుకు ఆర్టీసీ అధికారులు సమాయత్తమైయ్యారు. అందుకోసమా ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంత్రి అజయ్ సమక్ష సమావేశం నిర్వహించారు.

మేడారం జాతర సమీపిస్తోన్న నేపథ్యంలో ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరిగే ఈ మహాజాతర కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపడనుందని వివరించారు. హైదరాబాద్​ నుంచి మేడారం ప్రత్యేక బస్సు సేవలు ఈనెల 16 నుంచి అందుబాటులోకి వస్తాయని, ఎంజీబీఎస్ నుంచి ఈ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు.

హైదరాబాద్ డిపో-1 సూపర్ లగ్జరీ బస్సులు ఎంజీబీఎస్ నుంచి ఉదయం 6 గంటలకు స్టార్ట్ అవుతాయని పేర్కొన్నారు. మేడారం నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరుతాయని వెల్లడించారు. హైదరాబాద్ -2 డిపో బస్సులు ఎంజీబీఎస్ నుంచి ఉదయం 7 గంటలకు మేడారం నుంచి సాయంత్రం 4 గంటలకు బయల్దేరుతాయని చెప్పారు. పికెట్ డిపో బస్సులు ఎంజీబీఎస్ నుంచి ఉదయం 8 గంటలకు… మేడారం నుంచి సాయంత్రం 5 గంటలకు బయలుదేరుతాయని తెలిపారు.

ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీ వెబ్ సైట్​లో, టీఎస్ఆర్టీసీ యాప్​లో బస్సులను బుక్ చేసుకునే వెసలుబాటు కల్పించామన్నారు. మేడారం ప్రత్యేక బస్సులకు రూ.398లు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సమీక్ష సమావేశం లో ఆర్టీసీ ఛైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ ఎండీ సజ్జానార్, రవాణా మరియు ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.

Related posts

గన్నవరం ఎమ్మెల్యే వంశీకి అస్వస్థత.. మొహాలీలో ఆసుపత్రిలో చికిత్స!

Drukpadam

‘ఛలో విజయవాడ’ దద్దరిల్లింది …నిర్బంధాలను సైతం లెక్క చేయని ఉద్యోగులు!

Drukpadam

పరస్పర అంగీకారంతో శారీరకంగా కలిసి.. ఆపై పెళ్లికి నిరాకరించడం మోసం కాదు: బాంబే హైకోర్టు కీలక తీర్పు!

Drukpadam

Leave a Comment