మణుగూరు భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి కలుషిత నీరు!
-కలుషిత నీరు నేరుగా గోదావరిలోకి పోవడం వలన ప్రజలకు ఆరోగ్య సమస్యలు
-పట్టించుకోని పవర్ ప్లాంట్ అధికారులు
-జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలి
-ఎమ్మెల్యే చొరచూపి ప్రజల ప్రాణాలను రక్షించాలి
-లేకపోతె పవర్ ప్లాంట్ ముందు ప్రత్యక్ష ఆందోళన
-మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు పోరెడ్డి విజయలక్ష్మీ
మణుగూరు భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్(BTPS) అధికారుల నిర్లక్ష్యం వల్ల పవర్ ప్లాంట్ నుంచి వెలువడే బూడిద మరియు ఇతర వ్యర్ధాలను నేరుగా గోదావరి నదిలోకి వదలటం ద్వారా నీరు అంత కలుషితం అవుతుంది మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు పోరెడ్డి విజయలక్ష్మీ ఆందోళన వ్యక్తం చేశారు .ఈ నీరు త్రాగి ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలను ఎదురుకొంటున్నారు ఈ కలుషిత భూతాన్ని తొలగించి ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆమె డిమాండ్ చేశారు . ఈ నీటి తో సాగు చేయడం వలన రైతులు ,ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారని ఎన్ని సార్లు మోర పెట్టుకున్న పట్టించుకున్న నాధుడు లేకపోవడం శోచనీయమని అన్నారు . దీని ప్రభావం వలన నియోజకవర్గ ప్రజల పైన కాకుండా గోదావరి నది ప్రవాహ ప్రాంతాలకు కూడా ప్రమాదం పొంచి ఉందన్నారు . నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారాను అన్న స్థానిక ఎమ్మెల్యే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం కలుషిత నీటిని గోదావరిలోకి పోకుండా చూడటంలో పూర్తిగా వైఫలం చెందారని విమర్శించారు. ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధి చేయకపోయినా పరవాలేదు కానీ జరుగుతున్న నీటి కలుషిత దారుణ పరిణామాలను ఆయన అడ్డుకొని గోదావరి నది నీటి ని కలుషితం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు . లేనిపక్షంలో లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పవర్ ప్లాంట్ ముందు స్థానిక ప్రజలతో రైతులతో ఆందోళన కార్యక్రమం చేపడతామని ఆమె హెచ్చరించారు . నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నభద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అధికారులపై జిల్లా కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకోవాలి కోరారు . ప్రజలందరూ కొద్దీ రోజులు ఈ నీటి నీ త్రాగడం మానేయాలని కూడా ఆమె విజ్ఞప్తి చేశారు .