Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

హైదరాబాదులో మోహన్ బాబును కలిసిన మంత్రి పేర్ని నాని…

హైదరాబాదులో మోహన్ బాబును కలిసిన మంత్రి పేర్ని నాని…

  • హైదరాబాదులో బొత్స కుమారుడి పెళ్లి
  • పార్టీలకు అతీతంగా నేతల హాజరు
  • పెళ్లికి విచ్చేసిన వివిధ రంగాల ప్రముఖులు

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు సందీప్, పూజితల వివాహానికి అన్ని రంగాల ప్రముఖులు తరలి వచ్చారు. పార్టీలకు అతీతంగా నేతలు తరలి రాగా, ఈ పెళ్లి వేడుక ఆసక్తికర భేటీలకు వేదికగా నిలిచింది. బొత్స కుమారుడి పెళ్లి కోసం హైదరాబాద్ వచ్చిన ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని నటుడు మోహన్ బాబు నివాసానికి వెళ్లారు.

సినీ రంగ సమస్యలపై నిన్న సీఎం జగన్ తో సినీ ప్రముఖులు సమావేశం కాగా, ఆ భేటీ తీరుతెన్నులపై మోహన్ బాబుకు మంత్రి వివరించారు. ఆ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలను ఆయనకు తెలియజేశారు. అయితే, సీఎంతో సమావేశానికి కొందరినే ఆహ్వానించడం, మా, ఫిలిం చాంబర్ తదితర వర్గాల నుంచి కూడా సీఎంతో సమావేశానికి పిలిస్తే బాగుండేదన్న అంశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది.

కాగా, నిన్న సీఎం జగన్ తో చిరంజీవి, ప్రభాస్, మహేశ్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, ఆర్.నారాయణమూర్తి, అలీ భేటీ కావడం తెలిసిందే. సినిమా టికెట్ల ధరల సమస్యలకు ఈ భేటీతో దాదాపుగా తెరపడినట్టేనని భావిస్తున్నారు.

మీకు మా ఇంట్లో ఆతిథ్యమివ్వడం ఎంతో సంతోషంగా ఉంది నాని గారు: మంచు విష్ణు

Very happy to host Perni Nani says Manchu Vishnu
ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని ఈరోజు హైదరాబాదులోని మోహన్ బాబు ఇంటికి వెళ్లారు. మంత్రి బొత్స కుమారుడి పెళ్లి కోసం హైదరాబాదుకు వచ్చిన ఆయన మోహన్ బాబును కలిశారు. ఈ విషయాన్ని మంచు విష్ణు ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. మీకు మా ఇంట్లో ఆతిథ్యమివ్వడం చాలా సంతోషంగా ఉంది నాని గారు అని ఆయన ట్వీట్ చేశారు. ‘సినిమా టికెట్ల అంశంపై మీరు తీసుకున్న చొరవకు, తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి ఏపీ ప్రభుత్వ ప్రణాళికలను మాకు వివరించినందుకు ధన్యవాదాలు. ఇండస్ట్రీ ప్రయోజనాలను కాపాడుతున్నందుకు కృతజ్ఞతలు’ అని అన్నారు.

Related posts

పరీక్షల విషయంలో.. ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు!

Drukpadam

ఖమ్మం కార్పొరేషన్ లో గులాబీకి ప్రత్యాన్మాయం ఉందా?

Drukpadam

ధవళేశ్వరం వద్ద గోదావరికి పోటెత్తుతున్న వరద

Ram Narayana

Leave a Comment