Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కరోనా భయం …రేపటి నుంచి విద్యాసంస్థల మూసివేత!

కరోనా భయం …రేపటి నుంచి విద్యాసంస్థల మూసివేత!
తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
విద్యాసంస్థల్లో పెద్ద సంఖ్యలో కరోనా విస్తరణ
విద్యాసంస్థలను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటన
చివరకు అందరూ ఊహించిందే జరిగింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి వైద్య విద్యాసంస్థలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, హాస్టల్స్, గురుకుల విద్యాలయాలను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి శాసనసభ వేదికగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ప్రధానంగా రాష్టంలోని విద్యాలయంలో వ్యాప్తి చెడుతున్నదని తెలుసుకున్న ప్రభుత్వం అందుకనుగుణంగా చర్యలు చేపట్టింది . అంతకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ తో సబిత, విద్యాశాఖ ఉన్నతాధికారులు, వైద్యశాఖ అధికారులు చర్చలు జరిపారు. విద్యాసంస్థల్లో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న అంశంపై చర్చించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించిన ముఖ్యమంత్రి… విద్యాసంస్థలను మూసివేయాలని ఆదేశించారు. సీఎం నిర్ణయం మేరకు రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడనున్నాయి.

Related posts

గుజరాత్ ఎన్నికల వేళ అందరినీ ఆకర్షిస్తున్న ‘జంబో ఫ్యామిలీ’…

Drukpadam

ఉగాది రోజున వెంకటేశ్వరస్వామి ఆలయానికి ముస్లింలు… ఎందుకంటే..!

Drukpadam

ఢిల్లీ కోర్టులో కాల్పుల ఘటన నేపథ్యంలో న్యాయవాదులకు స్మార్ట్ కార్డులు!

Drukpadam

Leave a Comment