శత్రువులను నమ్మవచ్చు కానీ ద్రోవులను నమ్మకూడదు …తుమ్మల సంచలనం వ్యాఖ్యలు
-పాలేరు నుంచే పోటీ … కేసీఆర్ సహకారంతో జిల్లాను అభివృద్ధి చేస్తా ?
-ప్రజల ఆదరణ మరవలేనిది …
-జిల్లా ప్రజల సహకారంతో అభివృద్ధిని పరుగులు పెట్టించా?
-మళ్ళీ అవకాశం ఇస్తే రెట్టింపు అభివృద్ధి చేస్తా ?
-పాలేరు ప్రజలు ఏమి కోల్పోయామో తెలుసుకున్నారు
-దూకుడు పెంచిన తుమ్మల
-వందలాది వాహనాలతో నేలకొండపల్లి మండలం చెరువు మాదారం లో పర్యటన
ఎన్నికలు మరో సంవత్సరం పైగానే ఉన్నాయి. దీంతో ఆశావహులు స్పీడ్ పెంచారు . గత ఎన్నికల్లో ఓడిపోయినా మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు తిరిగి పాలేరు నుంచి పోటీ చేసేందుకు సిద్ద పడుతున్నారు . అందుకు యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తున్నారు . పాలేరు నియోజకవర్గం పరిధిలోని నేలకొండపల్లి మండలం లోని చెరువుమాదారం గ్రామం లో బుధవారం తుమ్మల పార్టీటించారు . ఈ సందరభంగా ప్రజలను ఉద్దేశించి ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు . శత్రువులను నమ్మవచ్చిగాని పార్టీలో ఉన్న ద్రోవులను నమ్మకూడదని ఘాటుగానే స్పందించారు. గత ఎన్నికల్లో ఓటమిని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు . సొంతపార్టీ వల్లే ఆయనకు ద్రోహం చేశారని అందువల్లనే ఓడిపోవడం జరిగిందని గట్టి అభిప్రాయంతో ఉన్నారు పాలేరు ప్రజల్లో ఎలాంటి లోపంలేదని కొందరి నమ్మక ద్రోహం వల్లనే తాను ఓడిపోయానని అధినేత కేసీఆర్ కు సైతం రిపోర్ట్ చేశారు . నాటి నుంచి పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్లు ఉన్న తుమ్మల అప్పుడప్పుడు జిల్లాలో పర్యటిస్తూ తన అనుయాయిలను కార్యకర్తలను కలుస్తున్నారు . ప్రత్యేకించి పాలేరు నియోజకవర్గం లో తరుచు పర్యటిస్తున్నారు . ఆయన పర్యటనకు ప్రజల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తుంది. ఆయన ఎక్కడకు వెళ్లిన వందలాది వాహనాలు పరుగులు తీస్తున్నాయి. నేడు చెరువు మాదారం లోను వందలాది వాహనాలు వెంట రాగ మోటార్ సైకిల్ పై తుమ్మల హల్చల్ చేశారు . తాను స్వయంగా మోటార్ సైకిల్ వెక్కి కార్యకర్తలను ఉత్సహపరిచారు . జై తుమ్మల నినాదాలతో ర్యాలీ ఆకట్టుకున్నది . రేపు రాబోయే ఎన్నికలకు రిహార్సల ఉన్నదని పలువురు పేర్కొంటున్నారు .
గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ యస్ లో చేరిన కందాల ఉపేందర్ రెడ్డి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేసీఆర్ సిట్టింగుల అందరికి టికెట్స్ ఇస్తానని ప్రకటించిన నేపథ్యంలో కందాల తనకే తిరిగి సీటు వస్తుందని ఆశిస్తున్నా వేళ తుమ్మల కూడా అంతకు మించి రెట్టింపు విశ్వాసంతో నియోజకవర్గంలో పర్యటనలు ప్రారంబించడంపై సర్వత్రా ఆశక్తి నెలకొన్నది ….