రేవంత్ ,ఎంపీ కోమటిరెడ్డి జాయింట్ ప్రెస్ మీట్ …కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలపై ధ్వజం!
-మోడీ ,కేసీఆర్ ఒక్కటేనన్న రేవంత్
-కేసీఆర్ అవినీతి పరుడంటున్న బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్న
-మోడీకి ఉపయోగపడేందుకే కేసీఆర్ దేశ పర్యటన అంటూ ఆరోపణలు
-బొగ్గు కుంభకోణం పై విచారణ జరపాలని డిమాండ్
-నైనా బొగ్గుగని శ్రీనివాస్ ద్వారా ఆధానికి అప్పగించే కుట్ర
-7 ఏళ్లుగా సి ఎం డి గా కొనసాగుతున్న శ్రీధర్ ను తొలగించండి
-కాంగ్రెస్‌ను వీడేది లేదని కోమటిరెడ్డి ప్రకటన
-సోషల్ మీడియాలో వస్తున్నా వార్తలకు మనస్తాపం
-చచ్చేటప్పుడు కాంగ్రెస్ జెండా కప్పుకొని చేస్తానని వెల్లడి
భిన్న దృవాలుగా ఉన్న కాంగ్రెస్ ఎంపీ రాష్ట్ర కాంగ్రెస్ కీలకనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి , పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీలో జాయింట్ గా మీడియా ముందుకు వచ్చారు .తెలంగాణ కాంగ్రెస్‌లో మంగళవారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. నిన్నటిదాకా కత్తులు దూసుకున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసిపోయారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన రేవంత్ రెడ్డితో కలిసి కోమటిరెడ్డి ఉమ్మడిగా మీడియా ముందుకు వచ్చారు. అంతేకాకుండా తాను కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదంటూ కోమటిరెడ్డి కీలక వ్యాఖ్య చేశారు. వెరసి నిన్నటిదాకా తమ మధ్య నెలకొన్న విభేదాలు మటుమాయం అయిపోయినట్టేనని ఇద్దరు నేతలు చెప్పినట్టయింది.
టీపీసీసీ చీఫ్ రేసులో రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్న సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరకముందు నుంచి కూడా పీసీసీ చీఫ్ పదవి కోసం కోమటిరెడ్డి యత్నించిన సంగతి తెలిసిందే. అయితే పార్టీ అధిష్ఠానం టీపీసీసీ చీఫ్ పదవిని రేవంత్ రెడ్డికి అప్పగించడంతో భగ్గుమన్న కోమటిరెడ్డి.. తాను రేవంత్‌ను కలిసే ప్రసక్తే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో విభేదాలు చాలానే ఉంటాయని చెప్పిన కోమటిరెడ్డి.. అవన్నీ సర్దుకుంటాయని తాజాగా వ్యాఖ్యానించడం గమనార్హం. తనపై సోషల్ మీడియా లో వస్తున్నా పుకార్లపై కూడా స్పందించారు . తాను పార్టీ మారుతున్నానని జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు . తాను చచ్చేవరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని ,ఛస్తే కాంగ్రెస్ జెండా కప్పలసిందేనని అన్నారు .
కాంగ్రెస్ పార్టీలో చిన్న చిన్న తగాదాలు సహజమని వాటిని బూతద్దంలో చూడలిసిన అవసరం లేదని కోమటిరెడ్డి అన్నారు . గత ఎన్నికల్లో ఎన్నికల అధికారి చర్యలవలన కొంత నష్టపోయామని ఈసారి అలాజరగనివ్వమని కోమటిరెడ్డి అన్నారు. ఇటీవల తాను ప్రధాన మంత్రిని కలిసి మూసి నది ప్రక్షాళన , హైద్రాబాద్ -విజయవాడ నేషనల్ హైవే భోగ్గుకుంభకోణం పై మాట్లాడానని ఆయన అన్ని విన్నారని స్పందించారని అన్నారు. తరువాత హైవే అథారిటీ కేంద్రమంత్రి తో మీటింగా కూడా జరిగిందని అన్నారు . విజయవాడ -హైద్రాబాద్ 6 లైన్ల రహదారికోసం కేంద్రానికి 10 పైగా లెటర్స్ కూడా రాసిన విషయాన్నీ గుర్తు చేశారు . త్వరలో అది కార్యరూపం దాల్చనున్నదని అన్నారు .
మోడీ -కేసీఆర్ ఒక్కటే …రేవంత్
మోడీ కేసీఆర్ ఒక్కటే అని మోడీ ప్రయోజాలనకోసమే కేసీఆర్ దేశంలో పార్టీఅతిస్తున్న విషయం మరువరాదని అన్నారు . కేసీఆర్ అవినీతి పరుడు అంటున్న బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు . ఇద్దరు తోడు దొంగలు అని విమర్శించారు. బొగ్గు కుంభకోణం వివరాలు కేంద్రానికి అందజేసిన చర్యలు లేవని అన్నారు . సింగరేణి సి ఎం డి శ్రీధర్ ఒకేచోట 7 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్న ఎందుకు బదిలీ చేయడంలేదని ప్రశ్నించారు . నైనా భోగ్గుగనుల్లో టెండర్ శ్రీనివాస్ ద్వారా ఆదానీలకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుందని రేవంతేడ్డి ఆరోపించారు .