Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కేంద్ర ప్రభుత్వ చర్యలను సహించేది లేదు -టీయూడబ్ల్యూజే

కేంద్ర ప్రభుత్వ చర్యలను సహించేది లేదు
-టీయూడబ్ల్యూజే

కొత్త చట్టాలతో దేశంలో కార్మికులకు, వర్కింగ్ జర్నలిస్టులకు తీరని ద్రోహం తలపెడుతున్న కేంద్ర ప్రభుత్వ చర్యలు సహించేది లేదని, పోరాటాలతోనే తగిన గుణపాఠం చెప్పాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) పిలుపునిచ్చింది.
ఆదివారం సాయంత్రం హైదర్ గుడ లోని సెంట్రల్ పార్క్ హోటల్ లో యూనియన్ అధ్యక్షులు నగునూరి శేఖర్ అధ్యక్షతన రాష్ట్ర విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. రాష్ట్రంలో యూనియన్ కార్యకలాపాలపై ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ సుదీర్ఘ నివేదికను సమర్పించారు. ఐజేయూ, టీయుడబ్ల్యుజె రాష్ట్ర బాధ్యులతో పాటు ఆయా జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొని జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించి తీర్మానాలను ఆమోదించారు.

ఐజేయూ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టులకు కనీస అవసరాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం సరైంది కాదని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం జర్నలిస్టులకు హెల్త్ కార్డులు అందించినప్పటికీ వాటి అమలుపై దృష్టి సారించక పోవడం సబబు కాదన్నారు. ఇటీవల జరిగిన శాసన సభ బడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగుల ఆరోగ్య సంక్షేమానికి నిధులు కేటాయించినప్పటికీ, జర్నలిస్టుల ఆరోగ్య అంశాన్ని ప్రస్థావించక పోవడం విచారకరమన్నారు. ఈ విషయంలో త్వరలో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని ఆయన తెలిపారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై ప్రభుత్వం కాలయాపన చేయడం ఎంతవరకు సమంజసమని శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. ఇంకా ఈ సమావేశంలో ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు దాసరి కృష్ణారెడ్డి, కె.సత్యనారాయణ, పీసీఐ మాజీ సభ్యులు ఎం.ఏ.మాజిద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కరుణాకర్, రాంనారాయణ, దొంతు రమేష్, సహాయ కార్యదర్శులు శ్రీనివాస్, ఫైసల్ అహ్మద్, కోశాధికారి మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఉర్దూ ఎడిటర్లకు సత్కారం

ఉర్దూ జర్నలిజం 200 ఏళ్ళు పూర్తి చేసుకొని ద్విశతాబ్ది ఉత్సవాలు చేసుకుంటున్న సందర్భంలో సీనియర్ ఉర్దూ ఎడిటర్లను టీయుడబ్ల్యుజె కార్యవర్గం సత్కరించింది. సియాసత్ ఎడిటర్ అమీర్ అలీ ఖాన్, భారత్ న్యూస్ ఎడిటర్ షౌకత్, సీనియర్ పాత్రికేయులు ఎం.ఏ.మాజిద్ లను ఐజేయూ అధ్యక్షులు
కె. శ్రీనివాస్ రెడ్డి శాలువా కప్పి సత్కరించారు.

 

Related posts

కేసీఆర్‌కు కరోనా నెగటివ్.. నేటి నుంచి మళ్లీ విధుల్లోకి!

Drukpadam

ఏకధాటిగా 12 గంటల పాటు పనిచేసిన బాంబే హైకోర్టు.. 80 కేసులు విన్న ప్రత్యేక ధర్మాసనం…

Drukpadam

తాజాగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పై నిషేధం విధించిన రష్యా!

Drukpadam

Leave a Comment