Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పాక్ అసెంబ్లీ లో హైడ్రామా …అవిశ్వాసంలో విదేశ కుట్ర అంటూ తోసిపుచ్చిన డిప్యూటీ స్పీకర్!

పాక్ అసెంబ్లీ లో హైడ్రామా …అవిశ్వాసంలో విదేశ కుట్ర అంటూ తోసిపుచ్చిన డిప్యూటీ స్పీకర్!
-పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఖానే.. అవిశ్వాసం నిలిపివేత
ఓటింగ్ కు తిరస్కరణ
-నేషనల్ అసెంబ్లీలో ప్రతిపక్షాల ఆందోళన
-సూమోటోగా స్వీకరించిన పాకిస్తాన్ సుప్రీం కోర్ట్
-ప్రతిపక్షాలు సైతం సుప్రీం కు …సుప్రీం లో వాదనలు
-సుప్రీం వైపు అందరి చూపు …

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాస తీర్మానాన్ని ఆ దేశ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ అనుమతించలేదు. ఇది విదేశాల కుట్ర అని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ సెషన్ ప్రారంభమైన కొద్దిసేపటికే పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది. అయితే, డిప్యూటీ స్పీకర్ ఖాసిం ఖాన్ సూరి మాత్రం దానిని తోసిపుచ్చారు. అవిశ్వాస తీర్మానాన్ని ఒప్పుకోలేదు. ఓటింగ్ పెట్టకుండా తిరస్కరించారు.

దీంతో అవిశ్వాస తీర్మానం జరిగే వరకు ఇమ్రాన్ ఖానే మళ్లీ ప్రధానిగా కొనసాగనున్నారు. అయితే, స్పీకర్ తీరుపట్ల ప్రతిపక్షాలు సభలోనే ఆందోళనకు దిగాయి. అవిశ్వాసానికి పట్టుబడుతున్నారు. వాస్తవానికి స్పీకర్ అసద్ ఖైజర్ పైనా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇవ్వడంతో డిప్యూటీ స్పీకర్ చైర్ లో కూర్చున్నారు. కాగా, అంతకుముందే ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. దేశాధ్యక్షుడు ఆరిఫ్ అల్వీతో సమావేశమయ్యారు.

పాకిస్తాన్ అసెంబ్లీ ఇమ్రాన్ పై అవిశ్వాసం తిరస్కరించడంతో వెంటనే పాకిస్తాన్ సుప్రీం కోర్ట్ కేసును సూమోటోగా తీసుకుంది. ప్రతిపక్షాలు కూడా సుప్రీం తలుపు తట్టాయి. కడపటి వార్తలు అందేసరికి సుప్రీం లో వేడివేడిగా వాదనలు కొనసాగుతున్నాయి. సుప్రీం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొన్నది. పాక్ పరిణామాలను ప్రపంచమంతా నిశితంగా గమనిస్తుంది.

అంతకు ముందు పాక్ హోమ్ మంత్రి అవిశ్వాసం నెగ్గితే ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేయవచ్చని అనుమానం వ్యక్తం చేశారు .

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ లకు పట్టిన గతే ప్రస్తుత ప్రధాని నవాజ్ షరీఫ్ కు ఎదురు కానుందా? అనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

‘‘వారు (ప్రతిపక్షాలు) ఇమ్రాన్ ను అరెస్ట్ చేస్తారన్నది నా ఊహ. ఇమ్రాన్ ను వారు ఉపేక్షించరు’’అని రషీద్ అహ్మద్ చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ ను పదవీచ్యుతుడ్ని చేసే విషయంలో విదేశీ కుట్ర ఉందా అన్న ప్రశ్నకు.. పాకిస్థాన్ ప్రజాస్వామ్యానికి ఎంతో ముప్పు పొంచి ఉందన్నారు. ముందస్తు ఎన్నికలు నిర్వహించడం ఒక్కటే దీనికి పరిష్కారమని చెప్పారు. గతంలో నవాజ్ షరీఫ్, పర్వేజ్ ముషారఫ్ సైతం పదవుల నుంచి దిగిపోయిన తర్వాత అరెస్టవడం తెలిసిందే.

పాకిస్థాన్ లో 144 సెక్షన్..

 

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్ లో పటిష్ఠమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇవాళ అవిశ్వాస తీర్మానంలో ఆయన ఓడిపోతే.. అరెస్ట్ చేస్తారన్న ఊహాగానాల మధ్య బందోబస్తును పెంచారు. ఆ దేశ నేషనల్ అసెంబ్లీ వద్ద బలగాలను పెంచారు.

నేషనల్ అసెంబ్లీ ప్రెస్ గ్యాలరీలోకి కనీసం ప్రెస్ ను కూడా అనుమతించడం లేదు. ఇస్లామాబాద్ లో ఎక్కడికక్కడ 144 సెక్షన్ ను విధించారు. సమూహాలుగా ఏర్పడడాన్ని నిషేధించారు. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులంతా అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. దీంతో పోలీసులు వాళ్లందరినీ అక్కడి నుంచి పంపించేశారు.

అవిశ్వాస తీర్మానం కోసం ఇప్పటికే ప్రతిపక్ష సభ్యులు నేషనల్ అసెంబ్లీకి చేరుకున్నారు. 174 మంది సభ్యుల బలం తమకుందని ప్రతిపక్ష నేత భిలావర్ బుట్టో ఇప్పటికే స్పష్టం చేశారు. స్పీకర్ అసద్ ఖైజర్ పై అవిశ్వాసం కోసం వంద మంది చట్టసభ సభ్యులు సంతకం చేశారు. మరోవైపు పంజాబ్ ప్రావిన్స్ (రాష్ట్ర) గవర్నర్ గా ఉమర్ సర్ఫరాజ్ చీమాను నియమించారు.

పీటీఐ పార్టీ ఏ విషయంలోనూ అక్రమంగా వ్యవహరించలేదని, రాజ్యాంగ విరుద్ధంగా ఏ పనీ చేయలేరని విద్యుత్ శాఖ మంత్రి హమ్మద్ అజర్ చెప్పారు. ప్రధానిపై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ప్రజలంతా ప్రశాతంగా ఉండాలంటూ ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి సూచించారు.

Related posts

మమ్మల్ని భారత్‌కు పంపించేయరూ.. బహ్రెయిన్‌లోని తెలుగు కార్మికుల గోడు!

Drukpadam

ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యంపై దర్యాప్తునకు ప్రత్యేక కమిటీని నియమించిన సుప్రీంకోర్టు!

Drukpadam

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యంపై పుకార్లు… వివరణ ఇచ్చిన అధ్యక్ష కార్యాలయం!

Drukpadam

Leave a Comment