Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఆశల పల్లకిలో ఊరేగిన తిప్పేస్వామి …మంత్రిపదవి వచ్చినట్లే వచ్చి పోయింది

చివరి నిమిషంలో ముఖంచాటేసిన మంత్రిపదవి… తిప్పేస్వామి స్పందన ఇదిగో!

ఆశల పల్లకిలో ఊరేగిన తిప్పేస్వామి …మంత్రిపదవి వచ్చినట్లే వచ్చి పోయింది
సంబరాలు జరుపుకున్న అభిమానులు ,కుటుంబసభ్యులు
ఆయన భాద వర్ణనాతీతం …

  • ఏపీలో కొత్త మంత్రివర్గం
  • తిప్పేస్వామిని ఊరించి ఉసూరుమనిపించిన వైనం
  • ఆయన బావమరిది ఆదిమూలపు సురేశ్ కు మంత్రిపదవి
  • తనకెలాంటి అసంతృప్తి లేదన్న తిప్పేస్వామి
  • మీడియా అసత్యప్రచారం చేస్తోందని ఆరోపణ

అనంతపురం జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే తిప్పేస్వామి కి మంత్రి పదవి వచ్చినట్లే వచ్చి చేజారింది. ప్రసారమాధ్యమాలు నిండా తిప్పేస్వామికి మంత్రిపదవి ఖాయమైంది వార్తలు వచ్చాయి. ఇంకేముంది .ఆయన అభిమానులు కుటుంబసభ్యులు ఆయనకు అభినందనలు తెలిపారు .సంబరాలు జరుపుకున్నారు . కానీ వచ్చిన పదవి కాస్త తిరిగి వెనక్కు పోయింది. ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి మంత్రులుగా ఉన్న బాలినేని , ఆదిమూలపు సురేష్ లలో ఒకరిని ఉంచి ఒకరిని తప్పించడంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఇద్దరినీ తొలగించి ఎస్సీ సామాజికవర్గానికి చెందిన డాక్టర్ తిప్పేస్వామికి మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే అప్పటికే మంత్రుల పేరులు లీక్ కావడం ప్రకాశం జిల్లా నుంచి ఎవరికీ మంత్రి పదవి లేదనే విమర్శలు వస్తున్నాయి. దానితో తిరిగి అక్కడ నుంచి ఆదిమూలపు సురేష్ ను తీసుకోవాలని జగన్ నిర్ణయించుకున్నారు . దీంతో తిప్పే స్వామి పేరు లిస్ట్ లోనుంచి ఎగిరిపోయింది. అదే విధంగా కారణం ధర్మశ్రీ , అబ్బయ్య చౌదరి మరికొందరి పేర్లు పరిశీలనలోకి వచ్చిన అక్కడ పరిస్థిలులు , సామాజిక సమీకరణాల నేపథ్యం లో వారిని ఎకామిడేట్ చేయలేక పోయారు .

ఏపీలో కొత్త మంత్రివర్గం నిన్న ప్రమాణం స్వీకారం చేసింది. అన్నీ కలిసొస్తే మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి కూడా నిన్న ప్రమాణస్వీకారం చేసినవాళ్లలో ఉండేవారు. కానీ, చివరినిమిషంలో అంతా తారుమారైంది. మంత్రివర్గ జాబితాలో ఓ దశలో తిప్పేస్వామి పేరు కూడా ఉంది.

కానీ, పలు ఒత్తిళ్ల నేపథ్యంలో ఆయన బావమరిది ఆదిమూలపు సురేశ్ తన మంత్రిపదవిని నిలుపుకున్నారు. దాంతో తిప్పేస్వామికి మంత్రి పదవి దూరమైంది. కాగా, మంత్రి పదవులు దక్కని కొందరు తీవ్ర మనస్తాపానికి గురికాగా, వారి మద్దతుదారులు ఆందోళనలు చేపట్టారు.

ఈ నేపథ్యంలో, తిప్పేస్వామి స్పందించారు. మంత్రి పదవి రాకపోవడంతో తాను అసంతృప్తితో ఉన్నట్టు జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని స్పష్టం చేశారు. మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయని ఆరోపించారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు ఈ అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్సార్ కుటుంబం వెంటే ఉంటానని ఉద్ఘాటించారు.

1999లో తనకు చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి పోటీ చేసే అవకాశాన్ని వైఎస్సార్ కల్పించారని తెలిపారు. ఆ తర్వాత జగన్ 2014, 2019లో మడకశిర ఎమ్మెల్యేగా చాన్స్ ఇచ్చారని వివరించారు. ఆ విశ్వాసం తనకు ఉందని తిప్పేస్వామి స్పష్టం చేశారు. తనకు ఎలాంటి అసంతృప్తి లేదని, ప్రాణం ఉన్నంతవరకు సీఎం జగన్ తోనే తన రాజకీయ ప్రస్థానం కొనసాగుతుందని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లోనూ జగన్ ను సీఎంగా చూడాలన్న ఆశయంతో పనిచేస్తానని తిప్పేస్వామి పేర్కొన్నారు.

Related posts

నా సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి క్రాస్ ఓటింగ్ చేయడం తప్పే: మేకపాటి రాజమోహన్ రెడ్డి…

Drukpadam

మాట ఇవ్వడం… మర్చిపోవడం కల్వకుంట్ల కుటుంబానికే సాధ్యం….పొంగులేటి

Ram Narayana

ఈటల వల్ల బీజేపీకి ప్లస్ అవుతుందా ?

Drukpadam

Leave a Comment