Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువ నిర్మాణం..భూమిని కోల్పోతున్న డీజీపీ మహేందర్‌రెడ్డి

సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువ నిర్మాణం.. 4.35 ఎకరాల భూమిని కోల్పోతున్న డీజీపీ మహేందర్‌రెడ్డి

  • భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలంలో ఎత్తిపోతల పథకం నిర్మాణం
  • కూసుమంచి మీదుగా ప్రధాన కాలువ
  • భూమిని కోల్పోతున్న డీజీపీ మహేందర్‌రెడ్డి, ఆయన సోదరుడు
  • డీజీపీకి రూ. 90,18,250 పరిహారం చెల్లించనున్న ప్రభుత్వం

భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలంలో గోదావరి నది నుంచి నీటిని ఎత్తిపోసేందుకు సీతారామ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం నిర్మిస్తోంది. అశ్వాపురం మండలంలో గోదావరి నది నుంచి నీటిని తోడి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో పాలేరు జలాశయంలోకి మళ్లిస్తారు. ఈ ప్రాజెక్టు ప్రధాన కాలువ తవ్వకం కోసం కూసుమంచి రెవెన్యూ గ్రామంలో సర్వే నంబరు 924లో 4.35 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. ఈ భూమి తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డిది కావడం గమనార్హం.

ఆయనకు అది వారసత్వంగా సంక్రమించింది. కాలువ నిర్మాణం కోసం డీజీపీ తన భూమిని కోల్పోతున్నందుకు గాను  ప్రభుత్వం రూ. 90,18,250 పరిహారం చెల్లించనుంది. ఈ మేరకు రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులు నిర్ణయించారు. వారం రోజుల్లోనే ఆ మొత్తం డీజీపీ మహేందర్‌రెడ్డి ఖాతాలో జమ కానున్నాయి. కాగా, డీజీపీతోపాటు ఆయన సోదరుడు నర్సింహారెడ్డి కూడా కొంత భూమిని కోల్పోతుండగా, ఆయనకు రూ. 15 లక్షల వరకు పరిహారం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

Related posts

టెస్లా అనుకుంటే పోర్షే ముందొచ్చింది… భారత మార్కెట్లోకి తొలి ఎలక్ట్రిక్ కారు!

Drukpadam

పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ తో కలిసి బీఆర్ఎస్ ఎంపీల నిరసన..

Drukpadam

సీఎం జగన్ ను కలిసిన ఆస్ట్రేలియా ఎంపీలు!

Drukpadam

Leave a Comment