Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

గాయత్రీ రవికి రాజకీయాల్లో మంచిరోజులు రానున్నాయా ?

గాయత్రీ రవికి రాజకీయాల్లో మంచిరోజులు రానున్నాయా ?
కేసీఆర్ ,కేటీఆర్ అశీసులతో చట్ట సభల్లో అడుగుపెట్టనున్నారా??
ఖమ్మం జిల్లా రాజకీయాలపై ద్రుష్టి పెట్టమని కేసీఆర్ అభయమిచ్చారా???
జిల్లా రాజకీయాల్లో గ్రూపులకు అతీతంగా రవి చేస్తున్న ఆలోచలను ఎంతవరకు సక్సెస్ అవుతాయి!

గాయత్రీ రవికి రాజకీయాల్లో మంచి రోజులు రానున్నాయా ?అంటే అవుననే అంటున్నారు ఆయన అనుయాయులు …గ్రానైట్ పరిశ్రమల అధిపతిగా ఉన్న వద్దిరాజు రవిచంద్ర అలియాస్ గాయత్రీ రవి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేయాలని గట్టి ప్రయత్నాలు చేశారు . అప్పుడు టీడీపీ కాంగ్రెస్ లు పొత్తులో భాగంగా ఖమ్మం అసెంబ్లీ సీటు టీడీపీకి కేటాయించగా నామా నాగేశ్వరరావు టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు .రవి వరంగల్ ఈస్ట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి టీఆర్ యస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఓడిపోయినా కుంగి పోకుండా రాజకీయాల్లో ఉన్నారు . ఇక కాంగ్రెస్ లో ఉంటె లాభంలేదనుకుని ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాల్లో ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార టీఆర్ యస్ పార్టీలో చేరారు .

నాటి నుంచి అధినేత కేసీఆర్ , యువనేత కేటీఆర్ గుడ్ లుక్స్ లో పడేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయనే చెప్పాలి . పార్టీ ఆదేశాల ప్రకారం అధినేత సూచనలకు అనుగుణంగా నడుచుకుంటున్నారని పేరు సంపాదించారు . రాష్ట్ర ముఖ్యనేతల అందరితో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. మంచితనం ,కలుపుగోలు తనం ,సహాయం చేసే గొప్ప మనస్తత్వం రవి సొంతం .సహాయం చేసేవాళ్ళు చాలామంది ఉన్న రవి ముందు బలాదూర్ అంటారు చాలామంది .కరోనా సమయంలో ఖమ్మం, వరంగల్ జిల్లాలో అనేకమందికి సహాయం అందించి ఆదుకున్నారు . జిల్లా అధికారులు సైతం ఆయనకు ఫోన్ చేసి ఫలానా చోట మీరు సహాయం చేయగలరా ? అని అడిగిన వెంటనే సహాయం అందించి తన గొప్ప మనస్తత్వాన్ని చాటుకున్నారు . కొంతమందికి తానే స్వయంగా ఇంజక్షన్ లు అందించి వారి ప్రాణాలు నిలిపేందుకు కృషిచేశారు .కోట్లకు పడగలెట్టినా ఎక్కడ దర్పం పదర్శించరు. అందరు నావాళ్లు అనుకోని వారి కష్ట సుఖాల్లో పలు పంచుకుంటారు . ఒకరకంగా చెప్పాలంటే అందరు బాగుండాలి అందులో నేనుండాలి అనుకునే గాయత్రీ రవికి మంచి రోజులు రావడం ఖాయమనే అభిప్రాయాలే వ్యక్తం అవుతున్నాయి.

కేసీఆర్ ,కేటీఆర్ గుడ్ లుక్స్ లో ఉన్న గాయత్రీ రవి చట్టసభల్లో అడుగు పెట్టడం ఖాయమని అంటున్నారు . కొందరు ఖమ్మం జిల్లా మంత్రి ఎమ్మెల్యేలు ఎంపీ ఎమ్మెల్సీలు సీఎం కేసీఆర్ ను కలిసినప్పుడు రవిని ప్రత్యేకంగా ఖమ్మం జిల్లా మీద కేంద్రీకరించమని సలహా ఇచ్చినట్లు సమాచారం . అందువల్ల రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో ఎదో ఒకసీటు గాయత్రీ రవికి కేటాయిస్తారనే అభిప్రాయాలే ఉన్నాయి. ఒకవేళ అసెంబ్లీ కాకపోతే మరో విధంగా చట్ట సభల్లో ఆయన సేవలు కేసీఆర్ ఉపయోగించుకుంటారని గట్టి నమ్మకంతో రవి ఉన్నారు .

ఖమ్మం జిల్లాలో ఆయన గ్రూప్ లకుఅతీతంగా తన పని తాను చేసుకుంటూ సమ్మతి ,అసమ్మతి నేతలందరితో సంబంధాలు కలిగి ఉన్నారు . కొంతకాలం క్రితం వరకు మంత్రి అజయ్ తో సఖ్యత లేదు . కానీ ఇటీవల కాలంలో ఇద్దరు కలిసి పోయారు . రవి బర్త్ వేడుకలకు అజయ్ ముఖ్య అతిధిగా హాజరైయ్యారు .తరువాత గ్రానైట్ సమస్యలపై రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో సమావేశంలో ప్రభుత్వం తరుపున మంత్రి అజయ్ పాల్గొనగా , గ్రానైట్ అసోసివేషన్ నుంచి గాయత్రీ రవి కూడా పాల్గొన్నారు . రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే ముందు ,ముందు ఖమ్మం జిల్లాలో ఏమి జరుగుతుందో చూద్దాం ….

 

Related posts

కాంగ్రెస్‌తో చర్చలు చివరి దశకు? రెండు రోజుల్లో ఢిల్లీకి షర్మిల!

Drukpadam

రిపబ్లిక్ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ను పవన్ కళ్యాణ్ మిస్ లీడ్ చేశాడా ?

Drukpadam

వచ్చే ఎన్నికల్లో సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పోటీ !

Drukpadam

Leave a Comment