Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మం లో యువకుడి ఆత్మహత్యకు కారకుడైన మంత్రిని భర్తరఫ్ చేయాలి :మధు యాష్కీ!

ఖమ్మం లో యువకుడి ఆత్మహత్యకు కారకుడైన మంత్రిని భర్తరఫ్ చేయాలి :మధు యాష్కీ…
-వడ్ల కొనుగోలు విషయంలో బీజేపీ ,టీఆర్ యస్ లవి దొంగ దీక్షలు
-కేటీఆర్ అండతో మంత్రి అజయ్ రెచ్చి పోతున్నదని విమర్శ
-కల్వకుంట్ల కుటుంబసభ్యులు ఆస్తులపై ఈడీ, సిబిఐ లతో దర్యాప్తు జరిపించాలి
-ఢిల్లీలో కల్వకుంట్ల చేసింది దీక్ష కాదు డ్రామా

ఖమ్మంలో యువకుడు ఆత్మహత్యకు కారణమైన మంత్రి అజయ్ ని వెంటనే మంత్రివర్గంనుంచి భర్తరఫ్ చేయాలనీ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ డిమాండ్ చేశారు . మంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ అండ చూసుకొని జిల్లా మంత్రి రెచ్చిపోతున్నాడని విమర్శించారు . మంత్రి వేధింపులు తట్టుకోలేక నగరంలో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిద్ర పోతున్నడా అని ప్రశ్నించారు . రౌడీ మంత్రిని తక్షణమే కేబినెట్ బర్తరఫ్ చేయాలనీ డిమాండ్ చేశారు .

మే 6న వరంగల్ పట్టణంలో కిసాన్ సంఘర్షణ పోరాట సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్యఅతిథిగా హాజరు అవుతున్నారు..

బీజేపీ – మోదీ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే.. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబ సభ్యుల ఆస్తులపై సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలతో విచారణ జరపాలన్నారు . తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త.. రాష్ట్రం వచ్చాక రాబందుల సమితిగా మారిందని ధ్వజమెత్తారు .. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం మిల్లర్లతోకుమ్మక్కై వేల కోట్ల రూపాయలను దోపిడీ చేస్తోందని విమర్శలు గుప్పించారు.

 

ఢిల్లీ రాజధానిలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసింది.. జరిగింది ధర్నా కాదు.. డ్రామా అని అన్నారు . బీజేపీ – టీఎర్ఎస్ పార్టీలు కుమ్మకై రైతులను హింస పెడుతున్నాయని దుయ్యబట్టారు . సమస్యలు పరిష్కరించాల్సిన ప్రధానమంత్రి మనుషులు హైదరాబాద్ లో ధర్నా చేస్తారు.. ముఖ్యమంత్రి ఢిల్లీలో ఏసీలు, కూలర్లు పెట్టుకుని డ్రామా చేస్తాడు. ఆంధ్ర భవన్ లో మెక్కుతో దొంగ దీక్షలు చేస్తారని అన్నారు . కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విపరీతంగా ధరలు పెంచుతూ సామాన్యులను హింసకు గురి చేస్తున్నారని మధు యాష్కీ విమర్శించారు . విలేకర్లు సమావేశంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు .

Related posts

ఖమ్మం గడ్డ అజయ్ అడ్డా …కూకట్ పల్లి ఎందుకు పీకటానికా …

Drukpadam

డబుల్ బెడ్ రూమ్ ల పేరుతొ అసలు ఇల్లులేకుండా చేస్తున్న తెలంగాణ సర్కారు:తమ్మినేని…

Drukpadam

నాపై దాడికి టీఆర్ యస్ కుట్ర …ఈటల అనుమానం ?

Drukpadam

Leave a Comment