Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

నో డౌట్ మరో పదేళ్లు కేసీఆర్ సీఎం -హరీష్ రావు

మరో పదేళ్లు కేసీఆర్ సీఎం -హరీష్ రావు
నో డౌట్ మరో పదేళ్లు పాటు కేసీఆర్ సీఎం గా ఉంటారు . అందులో అనుమానం అక్కర్లేదు.ఆయన వల్లనే తెలంగాణ వచ్చింది.రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది.సిద్దిపేటకు గోదావరి నీళ్లు తకాయంటే అది ఆయన చలవే .మిషన్ భగీరథ,మిషన్ కాకతీయ,షాదీ ముబారక్ ,కల్యాణ లక్ష్మి ,తదిర పధకాలు తెచ్చిన ఘనత ఆయనదే అని హరీష్ రావు అన్నారు. ఆయన వల్లనే సిద్ధిపేట ప్రత్యేక జిల్లాగా అవతరించిందన్నారు. కేసీఆర్ బర్త్ డే సందర్భంగా సిద్దిపేటలో ఆయన వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు.దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వనించారు. తెలంగాణ లో అమలు జరుగుతున్నా పథకాలను అనేక రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నామన్నారు. ఆయన నిత్యం తెలంగాణ ప్రజల గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచనలు చేస్తుండటం వల్లనే అనేక వినూత్న పధకాలు రాష్ట్రం లో అమలు జరుగుతున్నాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిన విషయాన్నీ ఆయన గుర్తుచేశారు. రాష్ట్రం లోనే కాకుండా దేశవిదేశాలలో కేసీఆర్ పుట్టిన రోజులు జరుగుతున్నాయన్నారు. ఒకప్పుడు తెలంగాణ అంటే ఎవరికీ తెలిసేది కాదని ఇప్పుడు తెలంగాణ అనగానే కేసీఆర్ అంటున్నారని పేర్కొన్నారు.తెలంగాణ ఏర్పాటులోను దాన్ని అభివృద్ధి చేయడంలో కేసీఆర్ పాత్ర మరువలేనిదని కొనియాడారు.ఒక చరిత్ర పురుషుడుగా కేసీఆర్ పేరు కలకలం ఉంటుందని హరీష్ రావు అన్నారు.

Related posts

పునఃనిర్మాణం అంటే ఇది … కొత్త సచివాలయ ప్రారంభ సందర్భంగా కేసీఆర్!

Drukpadam

హుస్నాబాద్ ఎమ్మెల్యే స‌తీశ్ కుమార్‌కు చేదు అనుభ‌వం!

Drukpadam

పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం గ‌డువును 2024కు పొడిగించిన కేంద్రం!

Drukpadam

Leave a Comment