Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

హత్య చేసిన వారెవరైనా వదిలిపెట్టం:మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్!

హత్య చేసిన వారెవరైనా వదిలిపెట్టం:మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్!
-మహబూబాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ హత్యపై స్పందించినమంత్రి
-రాజకీయాలకు అతీతంగా విచారణ జరిపిస్తామని హామీ
-వెంటనే దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆదేశించాము
-దీనిపై సమగ్రంగా సమీక్షించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం
-హత్యకు గురైన రవి నాయక్ మృతదేహాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యులకు -ధైర్యం చెప్పిన మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్

మహబూబాబాద్ 8వ వార్డు కౌన్సిలర్ బానోత్ రవి నాయక్ హత్య పై రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ తీవ్రంగా స్పందించారు. రవి నాయక్ మృతదేహాన్ని మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్ లో పరిశీలించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరపున, పార్టీ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ హత్యను తీవ్రంగా ఖండిచారు . ఈ ప్రాంతంలో ఇలాంటి వాటికి తావులేదని అన్నారు . ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయో సమీక్షించి, మళ్లీ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండే విధంగా తగిన చర్యలు తీసుకుంటామన్నారు

ఎంపీ ఎమ్మెల్యే అధికారులు కలిసి దీనిపై చర్చించి, ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఖచ్చితంగా వాటిని తీసుకుంటామన్నారు

హత్య చేసిన వారు ఎంత పెద్ద వారైనా…ఉన్న టెక్నాలజీని పూర్తిగా వినియోగించుకుని హత్య చేసిన వారిని వెంటనే పట్టుకోవాలని, అరెస్టు చేయాలని, కఠినంగా శిక్షించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని వారు ఆపనిలోనే ఉన్నారని పేర్కొన్నారు .

ఏది ఏమైనా మహబూబాబాదులో ఇలాంటి ఈ సంఘటన జరగడం దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఈ ప్రాంతంలో శాంతి నెలకొల్పడానికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు

రవి నాయక్ ఆత్మకు శాంతి చేకూర్చాలని,అన్నారు . రవి నాయక్ మృతికి సంతాపం తెలుపుతూ , వారి కుటంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు .

Related posts

ప్రాజెక్ట్ లను సెంట్రల్ బోర్డు కు అప్పగించడంపై రెండు రాష్ట్రాలు మెలిక!

Drukpadam

ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సిట్… బృందం చీఫ్ గా సీవీ ఆనంద్!

Drukpadam

రోజువారీ కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రాల జాబితాలో 5వ స్థానంలో ఏపీ…

Drukpadam

Leave a Comment