Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

న‌ల్గొండ అభివృద్ధిపై కేసీఆర్ ఆగ్ర‌హం!

cm kcr angry over nalgonda development works

నిధులు విడుద‌ల చేసినా ప‌నులు చేయ‌రా?…న‌ల్గొండ అభివృద్ధిపై కేసీఆర్ ఆగ్ర‌హం!

  • ఎమ్మెల్యే చిరుమ‌ర్తి లింగ‌య్య తండ్రి ద‌శ‌దిన క‌ర్మ‌కు హాజ‌రైన కేసీఆర్‌
  • అక్క‌డే న‌ల్గొండ అభివృద్ధి ప‌నుల‌పై స‌మీక్ష‌
  • ప‌నుల జాప్యంపై అసంతృప్తి వ్య‌క్తం చేసిన కేసీఆర్‌

న‌ల్గొండ ప‌ట్ట‌ణంలో అభివృద్ధి ప‌నుల తీరుపై తెలంగాణ సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్య‌క్తం చేశారు. అభివృద్ధి ప‌నుల కోసం నిధులు విడుద‌ల చేసినా… అభివృద్ధి ప‌నుల్లో జాప్యం ఎందుకు జ‌రుగుతోంద‌ని ఆయ‌న అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌క్ష‌ణ‌మే ప‌ట్ట‌ణంలో అభివృద్ధి ప‌నుల‌ను చేప‌ట్టాల‌ని ఆయ‌న అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు.

గురువారం న‌కిరేక‌ల్ ఎమ్మెల్యే చిరుమ‌ర్తి లింగ‌య్య తండ్రి ద‌శ దిన క‌ర్మ‌ల‌కు హాజ‌ర‌య్యేందుకు నార్క‌ట్ ప‌ల్లి వెళ్లిన కేసీఆర్ ఆ త‌ర్వాత అక్క‌డే న‌ల్గొండ‌లో అభివృద్ధి ప‌నుల‌పై అధికారుల‌తో స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా న‌ల్గొండ అభివృద్ధి ప‌నుల కోసం ఇప్ప‌టికే నిధులు విడుద‌ల చేసిన అంశాన్ని కేసీఆర్ ప్ర‌స్తావించారు. నిధులు విడుద‌ల చేసిన త‌ర్వాత కూడా ప‌నుల్లో జాప్యం ఎందుకంటూ ఆయ‌న అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇక‌నైనా ప‌నుల‌ను వేగంగా పూర్తి చేయాల‌ని ఆయ‌న అధికారుల‌ను ఆదేశించారు.

Related posts

ముగిసిన జీఎస్టీ మండలి సమావేశం…పెట్రో ఉత్పత్తులపై కుదరని ఏకాభిప్రాయం!

Drukpadam

మంత్రి హరిష్ రావు పై సీఎం కేసీఆర్ ప్రశంసల జల్లు…

Ram Narayana

ఏపీలో ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి త్వరలో నోటిఫికేషన్!

Ram Narayana

Leave a Comment